ఆ వీడియోలు పెట్టిన హంతకుడి ఖాతాలు కట్ | Sakshi
Sakshi News home page

ఆ వీడియోలు పెట్టిన హంతకుడి ఖాతాలు కట్

Published Thu, Aug 27 2015 6:31 PM

ఆ వీడియోలు పెట్టిన హంతకుడి ఖాతాలు కట్ - Sakshi

న్యూయార్క్: వర్జినియాలో జరిగిన కాల్పుల దృశ్యాలను ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేసిన హంతకుడు బ్రైస్ విలియం ఖాతాలను రెండు సామాజిక వెబ్ సైట్లు మూసివేశాయి. ఇలాంటి సంఘటనలు పోస్ట్ చేయకూడదని హెచ్చరించాయి. ఓ విషయానికి సంబంధించి ఇద్దరు టీవీ జర్నలిస్టులు లైవ్ వీడియో టెలికాస్ట్ చేస్తుండగా బ్రైస్ విలియం అక్కడికి వచ్చి వారిపై కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో అతడి నుంచి తప్పించుకునేందుకు లైవ్లో ఉన్న కెమెరా కిందపడేసింది. దీంతో అందులో కాల్పులకు సంబంధించిన దృశ్యాలు పూర్తిగా రికార్డు అవడమే కాకుండా అంతటా బయటకు వచ్చాయి.

తనను తాను కాల్చుకోకముందు విలియం రెండు వీడియోలను తన ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అందులో ఒకటి లైవ్ ప్రోగ్రాం చేస్తున్న అలిసన్ పార్కర్, అడమ్ వార్డ్ వైపు వెళుతున్నట్లుగా ఉండగా మరొకటి, కాల్పులు జరుపుతున్నప్పటిది ఉంది. దీనికి టాగ్ లైన్గా నేను కాల్పులను చిత్రీకరించాను అంటూ పెట్టాడు. అనంతరం తనను తాను కాల్చుకుని చనిపోయాడు. అయితే, అతడు పోస్ట్ చేసిన నిమిషాల్లోనే విలియం ఖాతాను రెండు సంస్థలు మూసివేశాయి. హింసాత్మక ఘటనలుగానీ, హింసను ప్రేరేపించే దృశ్యాలనుగానీ తమ ఖాతాదారులు పోస్ట్ చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేశాయి. నేరాలను వినోదంలాగా పంచుకోవడానికి ఒప్పకోబోమని తెలిపాయి.
 

Advertisement
Advertisement