ట్విటర్కు తగ్గిన ఆదరణ | Sakshi
Sakshi News home page

ట్విటర్కు తగ్గిన ఆదరణ

Published Thu, Feb 11 2016 2:07 PM

ట్విటర్కు తగ్గిన ఆదరణ - Sakshi

సోషల్ మీడియా పట్ల ముఖ్యంగా యువతలో ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఖాతాదారుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. వాటి షేర్ల విలువ కూడా ఈ మధ్య బాగా పెరిగింది. అయితే ట్విట్టర్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ట్విట్టర్కు ఆదరణ తగ్గుతుండగా, ఆర్థికంగా నష్టాలు వస్తున్నాయి. గతేడాది చివరి మూడు నెలల్లో ట్విట్టర్లో 20 లక్షల మంది యూజర్లు తగ్గారు. ఇక షేర్ల విలువ 12 శాతం తగ్గినట్టు ట్విట్టర్ యాజమాన్యం వెల్లడించింది.

2015 చివరకు ట్విటర్లో 30.50 కోట్ల మంది యూజర్లు ఉండగా, ఫేస్బుక్కు 160 కోట్లమంది ఖాతాదారులున్నారు. మరో సోషల్ మీడియా సంస్థ ఇన్‌స్టాగ్రాం కూడా ట్విట్టర్ను దాటిపోయింది. ఇన్స్టాగ్రామ్కు 40 కోట్లమంది యూజర్లు ఉన్నారు. ఆదరణ తగ్గుతున్న విషయాన్ని గమనించిన ట్విట్టర్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. కొత్త ప్రొడక్ట్లను ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. ఫేస్‌బుక్‌ తరహాలో అల్గారిథమిక్ టైమ్‌లైన్‌ను ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. దీనివల్ల మెరుగైన ఫలితాలు సాధిస్తామని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement