వర్సిటీ విద్యార్థిని ప్రాణం తీసిన సరదా | Sakshi
Sakshi News home page

వర్సిటీ విద్యార్థిని ప్రాణం తీసిన సరదా

Published Tue, Apr 4 2017 3:04 PM

వర్సిటీ విద్యార్థిని ప్రాణం తీసిన సరదా

కనెక్టికట్‌: సరదాగా చేసే పనులు ఒక్కోసారి ప్రాణాలను హరిస్తాయి. కొండంత సంతోషాన్ని విషాదంగా మారుస్తాయి. కనెక్టికట్‌లోని విశ్వవిద్యాలయంలో ఇదే చోటు చేసుకుంది. విద్యార్థునులు పెట్టుకున్న సరదా పోటీ ఓ వర్సిటీ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయేలా చేసింది. పాన్‌ కేక్‌ తినే పోటీలో పాల్గొన్న కైట్లిన్‌ నెల్సన్‌ అనే యువతి వేగంగా తినే క్రమంలో మధ్యలో ఓసారి పొరబోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపట్ల మొత్తం వర్సిటీ విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపింది.

కనెక్టికట్‌లో సేక్రడ్‌ హార్ట్‌ యూనివర్సిటీ ఉంది. ఇందులో కైట్లిన్‌ నర్సింగ్‌ జూనియర్‌ విద్యార్థినిగా ఉంది. ఇందులో ఆమె సోషల్‌ వర్క్‌ విభాగాన్ని ఎంచుకుంది. ఇటీవల అక్కడ కాల్పులు జరిగిన పాఠశాలలో గొప్ప సేవలు అందించింది కూడా. అంతేకాదు.. ఆమె తండ్రి జేమ్స్‌ నెల్సన్‌ న్యూయార్క్‌లో పోర్ట్‌ అథారిటీ విభాగంలో పోలీసు అధికారిగా ఉంటూ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై సెప్టెంబర్‌ 11న బాంబు దాడి జరిగిన సమయంలో ప్రజలను కాపాడే క్రమంలో ప్రాణాలుకోల్పోయాడు. అలా తండ్రి బాటలోనే నడుస్తూ సోషల్‌ సర్వీస్‌ అందించాలనే ఆత్రంతో కెరీర్‌ ప్రారంభించిన కైట్లిన్‌ చిన్న సరదాకు పోయి దురదృష్టవశాత్తు ప్రాణాలుకోల్పోయింది.

Advertisement
Advertisement