డియర్ ఒబామా.. సిరియాకు వెళ్లు | Sakshi
Sakshi News home page

డియర్ ఒబామా.. సిరియాకు వెళ్లు

Published Sat, Sep 24 2016 4:17 AM

డియర్ ఒబామా.. సిరియాకు వెళ్లు - Sakshi

ఒబామాకు లేఖ రాసిన ఆరేళ్ల బాలుడు
న్యూయార్క్: సిరియా వాయుసేన దాడిలో గాయపడి అంబులెన్సులో రక్తమోడుతూ దీనంగా కూర్చున్న ఐదేళ్ల బాలుడు ఒమ్రాన్ అందరికీ గుర్తుండే ఉంటాడు. తాజాగా అమెరికాకు చెందిన అలెక్స్ అనే ఆరేళ్ల బాలుడు.. ఒమ్రాన్‌ను తన ఇంటికి తీసుకురావాలని, తమ్ముడిలా చూసుకుంటానని అధ్యక్షుడు ఒబామాకు లేఖ రాశాడు. ఈ లేఖను ఒబామా ఐక్యరాజ్యసమితిలో చదివి వినిపించారు. అలెక్స్ స్వదస్తూరీతో రాసిన  లేఖలో ‘ఒబామా! వెళ్లి ఒమ్రాన్ ను మా ఇంటికి తీసుకురండి. మేం మీకోసం జెండా, పూలు, బెలూన్లతో ఎదురుచూస్తూ ఉంటాం. అతణ్ని మా కుటుంబంలో చేర్చుకుంటాం. తమ్ముడిలా చూసుకుంటా. ఇంగ్లిష్ నేర్పిస్తాం’ అని పేర్కొన్నాడు.

Advertisement
Advertisement