మళ్లీ తెరపైకి అమెరికా పేట్రియాట్ క్షిపణులు | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి అమెరికా పేట్రియాట్ క్షిపణులు

Published Sat, Feb 13 2016 8:11 AM

US deploys more Patriot missiles in South Korea

గల్ఫ్ వార్ సమయంలో రష్యన్ స్కడ్ మిసైళ్లను ఛేదించడానికి తాను ప్రయోగించిన పేట్రియాట్ మిసైళ్లను ఇప్పుడు ఆమెరికా మళ్లీ తెరమీదకు తీసుకొచ్చింది. ఉత్తరకొరియా ఇటీవలే అణు పరీక్ష, లాంగ్ రేంజి రాకెట్ ప్రయోగాలు చేయడంతో.. దానికి చెక్ పెట్టేందుకు దక్షిణ కొరియాలో అదనంగా ఒక పేట్రియాట్ మిసైల్ బ్యాటరీ మోహరించింది.

వచ్చే వారం దక్షిణ కొరియాలో మరిన్ని అత్యాధునిక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌లను అమెరికా మోహరించనున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ పేట్రియాట్ మిసైళ్లను అక్కడకు తరలించింది. ఉత్తర కొరియా నుంచి వచ్చే ఎలాంటి దానినైనా ఎదుర్కొనేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఇలాంటి ఎక్సర్‌సైజులు ఉపయోగపడతాయని ఎయిత్ ఆర్మీకి చెందిన కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ థామస్ వండాల్ చెప్పారు.

Advertisement
Advertisement