అన్నవాహిక పునర్నిర్మాణం | Sakshi
Sakshi News home page

అన్నవాహిక పునర్నిర్మాణం

Published Tue, Apr 12 2016 7:42 PM

US doctors reconstruct new oesophagus tissue in patient

వాషింగ్టన్: బాగా దెబ్బతిన్న అన్నవాహికను తొలిసారిగా అమెరికా వైద్యులు పునర్నిర్మించారు. మెటల్ స్టెంట్స్, చర్మ కణజాలాలను వాడి బాగు చేశారు. ఈ వైద్య బృందంలో భారత సంతతి వైద్యుడు కుల్విందర్ దువా కూడా ఉన్నారు.

మెటల్ స్టెంట్స్‌ను తాత్కాలిక అన్నవాహికగా మార్చి, దీనికి చర్మం నుంచి సేకరించిన కణజాలాన్ని జోడించి 5 సెం.మీల మందంతో రోగి అన్నవాహికలో అమర్చారు. ఇందులోని కణజాలం పెరుగుతూ అన్నవాహికను పూర్తిగా పునర్నిర్మిస్తుంది. దీనికోసం రోగి శరీరంలో తగిన ఏర్పాట్లు చేశారు.
 

Advertisement
Advertisement