తల్లి దారుణం.. పది అడుగుల గుహలో పిల్లలు | Sakshi
Sakshi News home page

తల్లి దారుణం.. పది అడుగుల గుహలో పిల్లలు

Published Sun, Sep 13 2015 8:58 AM

తల్లి దారుణం..  పది అడుగుల గుహలో పిల్లలు

కాన్సాస్: అపాయకర పరిస్థితుల మధ్య తన పిల్లల్ని పెంచిన ఓ తల్లిని ముస్సోరి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వారికి కనీస సౌకర్యాలు కల్పించలేదని, ఉంచకూడని ప్రదేశంలో వారిని ఉంచిందని కోర్టుకు తెలియజేశారు. ముస్సోరిలోని కాన్సాస్ సిటీ పోలీసులు ఓ కారు దొంగతనానికి సంబంధించి గాలింపులు జరుపుతుండగా ఓ గుహ ప్రాంతంలో భూమిగర్భంలో కనీసం పది అడుగుల లోతున్న ఓ చెక్కతో అరకొరగా నిర్మించిన నిర్మాణం కనిపించింది.

వారు లోపలికి వెళ్లి చూడగా అందులో ఓ నాలుగేళ్ల, ఆరేళ్ల పిల్లలు కనిపించారు. వారిద్దరు కూడా మురికిపట్టి గబ్బుకొట్టే పరిస్థితులమధ్య ఉండటమే కాకుండా ఒంటిమీద పూర్తి స్థాయిలో దుస్తులు కూడా లేవు. కాళలకు చెప్పులు లేవు. ఓ చీకటి గుహలాంటి ప్రదేశంలో ఉంచిదని ఇది పిల్లల హక్కుల ప్రకారం నేరమవుతుందని కోర్టు చెప్పడంతో కోర్టు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement