భారత్‌ విషయంలో మాకా తెలివి ఉంది! | Sakshi
Sakshi News home page

భారత్‌ విషయంలో మాకా తెలివి ఉంది!

Published Mon, May 16 2016 3:08 PM

భారత్‌ విషయంలో మాకా తెలివి ఉంది!

బీజింగ్‌: ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకునే తెలివి భారత్‌-చైనాలకు ఉందని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ సమస్య శాంతియుత పరిష్కారం కోసం భారత్‌-చైనా ఉమ్మడిగా చేస్తున్న కృషిని గౌరవించాలని అమెరికాకు సూచించింది. భారత్‌ సరిహద్దుల్లో చైనా భారీగా సైనికుల్ని మోహరిస్తుందంటూ అమెరికా రక్షణవిభాగం పెంటాగాన్ ఆరోపించడంపై చైనా స్పందించింది.

'భారత్‌-చైనా సరిహద్దు ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి, శాంతి పరిరక్షణకు చర్యలు తీసుకోవడానికి చైనా కట్టుబడింది. భారత్‌తో చర్చల ద్వారా సరిహద్దు అంశాన్ని పరిష్కరించుకోవాలని భావిస్తోంది' అని చైనా విదేశాంగ శాఖ పీటీఐ వార్తాసంస్థకు తెలిపింది.

'భారత సరిహద్దులకు సమీపంలో చైనా సైనిక మోహరింపు బాగా పెరిగిపోవడం, ఇక్కడ రక్షణ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవడం మేం గుర్తించాం' అని అమెరికా రక్షణవిభాగం పెంటాగాన్‌ ఇటీవల చట్టసభ కాంగ్రెస్‌కు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విరవణ కోరగా చైనా విదేశాంగశాఖ స్పందిస్తూ.. సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే  మేధస్సు ఇరుదేశాలకు ఉన్నదని, దీనిని వ్యతిరేకించుకోవడం అమెరికా మానుకోవాలని పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement