చనిపోతూ.. తల్లికి వాట్సప్ మెసేజ్ | Sakshi
Sakshi News home page

చనిపోతూ.. తల్లికి వాట్సప్ మెసేజ్

Published Wed, Dec 2 2015 11:24 AM

చనిపోతూ.. తల్లికి వాట్సప్ మెసేజ్ - Sakshi

అతను ఓ పాపకు తండ్రి. జీవితం మీద విరక్తి చెందాడు. చనిపోతున్నానంటూ తన తల్లికి వాట్సప్లో మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ పంపిన ఆరు గంటలకు ఆ తల్లి వాటిని చూసింది. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని చెస్టర్సన్ ప్రాంతానికి చెందిన  26 ఏళ్ల యువకుడు క్రెయిగ్ వెస్ట్బీకి తన గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ అయింది. అయితే అప్పటికే అతనికి గర్ల్ఫ్రెండ్తో ఓ సంతానం కూడా కలిగింది. తనతో మళ్లీ కలవడానికి ఎంతగానో ప్రయత్నించిన క్రెయిగ్ ఆ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో మానసికంగా తీవ్రంగా కుంగిపోయాడు. తల్లి బివర్లీ అలెగ్జాండర్తో చనువుగా ఉండే వెస్ట్బీ.. ఆమెతో పలుమార్లు ఆత్మహత్యకు పాల్పడాలనే తన ఆలోచనను వెలిబుచ్చాడు. అలెగ్జాండర్ తన కొడుకుకి జీవితం పట్ల భరోసా ఇచ్చి నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. కానీ అతనిలో మార్పు రాలేదు.

చివరకు తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ తల్లికి మెసేజ్ పెట్టి తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆ సమయంలో నిద్రలో ఉన్న బివర్లీ ఆ మెసేజ్ను కొడుకు పంపిన 6 గంటల తర్వాత చూసుకుంది. హుటాహుటిన క్రెయిగ్ గదికి వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. ఆత్మహత్యకు సన్నద్ధమయ్యే ఫొటోలతో పాలు కొన్ని వీడియోలను కూడా తల్లికి వాట్సప్లో పంపించాడు. కాగా వాటిని బహిర్గతం చేయడానికి ఆమె నిరాకరించింది. అయితే 'ఈ జీవితం నాకు వద్దు' అని మాత్రం చెప్పాడని ఆమె తెలిపింది. క్రెయిగ్ మరణాన్ని విచారణ చేపట్టిన అధికారి మాట్లాడుతూ.. బ్రేకప్ల వలన మహిళల కన్నా పురుషులే ఎక్కువ కుంగుబాటుకు లోనవుతారని చెప్పేలా క్రెయిగ్ ఉదంతం ఉందని చెప్పారు.

Advertisement
Advertisement