కస్టమర్కి కిడ్నీదానం చేసేసింది.. | Sakshi
Sakshi News home page

కస్టమర్కి కిడ్నీదానం చేసేసింది..

Published Mon, Jun 1 2015 1:18 PM

కస్టమర్కి కిడ్నీదానం చేసేసింది..

జార్జియా(అమెరికా): అవసరం ఉంటే మాట సాయం చేస్తాం...మరీ దగ్గరి వారయితే డబ్బు దానం చేస్తాం... కిడ్నీ లాంటి అవయవాలైతే కుటుంబ సభ్యులు అయినా కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. అయితే  ఎలాంటి రక్తసంబంధం లేకుండానే రెస్టారెంట్ రెగ్యులర్గా వచ్చే ఓ కస్టమర్ కోసం అందులో పనిచేసే అమ్మాయి ఏకంగా తన కిడ్నీని దానం చేసేసింది.

వివరాల్లోకి వెళితే...జార్జియాలోని రోస్ వెల్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో వెయిటరెస్గా పని చేసే మారియానా విల్లారియల్ అనే అమ్మాయి తమ రెగ్యులర్ కస్టమర్కు కిడ్నీని దానం చేసింది. 10 ఏళ్ల నుంచి తమ రెస్టారెంట్కు రెగ్యులర్ కస్టమర్తో పాటు, మంచి వ్యక్తిగా గుర్తింపు ఉన్న డాన్ థామస్ క్యాన్సర్ వ్యాధితో రెండు కిడ్నీలు పాడైపోయాయి. మామూలు పరిచయం మాత్రమే అయినప్పటికీ అతని ప్రాణం కాపాడటానికి తన కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చింది.  దీంతో విల్లారియల్ నుంచి సేకరించిన కిడ్నీతో థామస్కు వైద్యులు సర్జరీ చేశారు.  ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.

'కొన్ని రోజుల కింద మా నానమ్మను కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగానే కోల్పోయాను... ఆ సమయంలో మా నానమ్మ కోసం నేనేమీ చేయలేకపోయాను...అందుకే నా కిడ్నీ థామస్కి సరిపోతుందని తెలిసిన వెంటనే కిడ్నీ దానం చేయడానికి ఒప్పుకున్నాను..డాన్ థామస్ని కాపాడటంలో మా గ్రాండ్ మదరే నాకు ఆదర్శం.. డాన్ థామస్ మరిన్ని రోజులు బతికితే అదే నాకు ఆనందం' అని సర్జరీ అనంతరం మారియానా విల్లారియల్ తెలిపింది.

 

Advertisement
Advertisement