చంపేస్తారనుకున్నా.. రేప్ చేస్తారనుకోలేదు! | Sakshi
Sakshi News home page

చంపేస్తారనుకున్నా.. రేప్ చేస్తారనుకోలేదు!

Published Fri, Jun 2 2017 9:28 PM

చంపేస్తారనుకున్నా.. రేప్ చేస్తారనుకోలేదు!

కోజో: 'మమ్మల్ని అదే క్షణంలో కాల్చి చంపేస్తారనుకున్నాం. మాపై పాశవికంగా అత్యాచారాలు చేస్తారని మాత్రం ఊహించలేదు. ఎంతో సంతోషంగా ఏ కల్మషం లేకుండా నవ్వుతు ఉండే అమ్మాయిలను ఎత్తుకుపోయి అమ్మేస్తారు. ఆపై కొందరిని సెక్స్ బానిసలుగా చేసి చిత్రవధ చేస్తారు'. ఇవి ఐసిస్ చెర నుంచి తప్పించుకున్న ఇరాక్ యువతి నదియా మురాద్ విషాధ గాథ.

 

తనను ఎక్కడైతే ఐసిస్ ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారో.. సరిగ్గా మూడేళ్ల తర్వాత తన స్వగ్రామం యాజిదికి చేరుకుని ఉద్వేగానికి లోనయ్యారు మురాద్. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో యాజిదీలు, శరణార్థులు, మహిళల హక్కులపై పోరాడే లాయర్‌గా విధులు నిర్వహిస్తున్నారు నదియా మురాద్. మూడేళ్ల కిందట తన జీవితంలో చోటుచేసుకున్న భయానక ఘటనను గురువారం చెప్పుకొచ్చారు. '2014 వేసవిలో మా గ్రామం యాజిదిని ఒక్కసారిగా ఐసిస్ ఉగ్రవాదులు చుట్టుముట్టారు. కొన్ని నిమిషాల్లోనే మగవారు.. ఆడవారు అంటూ వేరు చేశారు. పురుషులందర్నీ మా కళ్లముందే నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. దీంతో మమ్మల్ని కూడా చంపేస్తారని భావించాం. కానీ అలా జరగలేదు. మొసుల్ తీసుకెళ్లి యువతులను అమ్మేశారు. ఆ తర్వాత సిరియన్లు, ఇరాకీయులు, ట్యూనిషియన్లు, యూరోపియన్లు మాపై అత్యాచారం చేసేవాళ్లు.

యాజిదీకి చెందిన 3వేలకు పైగా ఆడవాళ్లను బలవంతంగా తీసుకెళ్లి సెక్స్ బానిసలుగా చేశారు. అదృష్టవశాత్తూ అదే ఏడాది నవంబర్ లో నేను ఎలాగోలా ఆ నరకకూపం నుంచి తప్పించుకోగలిగాను' అంటూ నదియా మురాద్ తన గతాన్ని వెల్లడించారు. 2015లోనే ఐరాసలో తన మనోవేదనను మురాద్ ఎల్లగక్కారు. ఆపై యూరప్ పార్లమెంటేరియన్ కు ఇచ్చే సఖరోవ్ అవార్డుతో ఆమెను సత్కరించారు. 19 ఏళ్ల బషర్‌ అనే యువతి ఏకంగా కంటిని కోల్పోయారు. సెక్స్ బానిసగా ఉండేందుకు నిరాకరించినందుకు ఆమెకు ఆ గతి పట్టించారని ఐసిస్ చెర నుంచి తప్పించుకున్న తర్వాత విషయం వెలుగుచూసింది. చాలా కుటుంబాల్లో ఇలాంటి దయనీయ పరిస్థితులు ఉన్నాయని మురాద్ వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement