‘పాకిస్తాన్‌ మెడలు వంచుతాం’ | Sakshi
Sakshi News home page

‘పాకిస్తాన్‌ మెడలు వంచుతాం’

Published Sat, Nov 18 2017 10:54 AM

'We will take Pakistan head on' - Gilgit Baltistan leaders warn Islamabad - Sakshi

న్యూఢిల్లీ : పన్నుల పేరుతో తమపై మోయలేని భారాన్ని మోపుతూ పాకిస్తాన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పన్ను విధానంపై గిల్గిత్‌ బాల్టిస్తాన్‌ ప్రజలు శనివారం భగ్గుమన్నారు. చిన్న వ్యాపారులపై అధిక భారాన్ని మోపడంపై మండిపడ్డారు. పాకిస్తాన్‌ ప్రభుత్వం దిగొచ్చే వరకూ నిరసనలతో హోరెత్తిస్తామని హెచ్చరించారు. స్కర్దు, గిల్గిత్‌ బాల్టిస్తాన్‌లలోని వ్యాపారులందరూ ఈ నిరసనల్లో పాల్గొననున్నారు.

పాకిస్తాన్‌ ప్రభుత్వంపై మనం పోరాడబోతున్నాం. కరచీ, క్వెట్టా, లాహోర్‌లలోని ప్రజలు, వ్యాపారులు ఉప్పెనై కదలి పాక్‌ ప్రభుత్వ మెడలు వంచాలని గుర్తు తెలియని నాయకుడు స్కర్దులో ఏర్పాటు చేసిన సమావేశం పేర్కొన్నట్లు తెలిసింది. గత నెలలో 22వ తేదీన బ్లాక్‌ డే సందర్భంగా గిల్గిత్‌ వ్యాప్తంగా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు మారుమోగిన విషయం తెలిసిందే.

1947లో ఇదే రోజున పాకిస్తాన్‌ జమ్మూకశ్మీర్‌లో చొరబాటుకు పాల్పడి గిల్గిత్‌ను తన ఆధీనంలోకి తీసుకుంది. అందుకు నిరసనగా గిల్గిత్‌ ప్రజలు పాక్‌ ఆర్మీ తమ భూభాగాన్ని వదిలి వెళ్లిపోవాలని నిరసన చేపట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement