చక్కా‘చెక్క’ని భవనాలు... | Sakshi
Sakshi News home page

చక్కా‘చెక్క’ని భవనాలు...

Published Sat, May 3 2014 4:45 AM

చక్కా‘చెక్క’ని భవనాలు... - Sakshi

ఇదో 14 అంతస్తుల అపార్టుమెంటు డిజైన్. ఇటీవలే నార్వేలోని సెంట్రల్ బెర్జెన్‌లో దీన్ని కట్టడం ప్రారంభించారు. 2015 అక్టోబర్‌లో దీని నిర్మాణం పూర్తవుతుంది. ఇందు లో ఓ ప్రత్యేకత ఉంది. దీన్ని కట్టేది కాంక్రీట్‌తో కాదు.. కలపతో.. ఇది మొత్తం చెక్కతో రూపొందుతున్న అపార్ట్‌మెంట్. ప్రపంచంలో అతి పెద్ద ది కూడా. దీని నిర్మాణం పూర్తయితే.. గిన్నిస్ బుక్‌లోకి ఇదిఎం‘చెక్కా’ ఎక్కేస్తుందన్నమాట. 161 అడుగుల ఎత్తుండే ఈ అపార్ట్‌మెంటులో 62 విలాసవంతమైన ఫ్లాట్లు ఉంటాయి. ఒక్కోదాని రేటు రూ. 40 కోట్లు.
 
 వచ్చే ఏడాది ఫ్రాన్స్‌లో దర్శనమివ్వనున్న భవనమిది. ‘ప్రపంచాన్ని పోషించడమెలా’ అన్న అంశంపై ఏర్పాటు చేస్తున్న ఓ ప్రదర్శనకు వేదికగా మారుతోంది ఈ అత్యాధునిక భవనం. ఎక్స్-టీయూ అనే ఆర్కిటెక్చర్ కంపెనీ రూపొందించిన దీన్ని పూర్తిగా కలపతో కట్టనున్నారు. అంతేనా? ఊహూ.. కానేకాదు.. భవనం పైన అక్కడక్కడా పచ్చగా కనిపిస్తోంది చూడండి... అందులో ఓ గొప్ప విశేషముంది. అవన్నీ ఆకుకూరలు, కూరగాయ మొక్కలు! ఇక్కడ సాగు చేసిన కాయగూరలతోనే... భవనం లోపలున్న ఓ హోటల్‌లో ఘుమఘుమలాడే వంటకాలను వండి వారుస్తుంది!
 
 

Advertisement
Advertisement