10 సెకన్లలో 60 జీబీని పంపారు! | Sakshi
Sakshi News home page

10 సెకన్లలో 60 జీబీని పంపారు!

Published Wed, May 25 2016 1:58 AM

10 సెకన్లలో 60 జీబీని పంపారు!

బెర్లిన్: వైర్లెస్ సమాచారాన్ని రేడియో తరంగాల ద్వారా వేగంగా పంపించడంలో జర్మన్ శాస్త్రవేత్తలు కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. జర్మనీలోని స్టట్‌గార్ట్ వర్సిటీ, ఫ్రాన్‌హోఫర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అప్లయిడ్ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ విభాగానికి చెందిన పరిశోధక బృందం ఈ రికార్డును సాధించారు. జర్మనీలోని వాచ్‌బెర్గ్ టౌన్‌కు కొలొగ్నె కు మధ్య దూరం 36.7 కి.మీటర్లు. ఈ బృందం రెండుప్రాంతాలకు 60 గిగాబైట్ల సమాచారాన్ని రేడియో తరంగాల ద్వారా కేవలం 10 సెకన్లలో పంపింది.

అంటే సెకనుకు 6 గిగాబైట్లా సమాచారాన్ని పంపించారు. ఇందుకు ఈ-బ్యాండుగా పిలిచే  71-76 గిగా హెట్జ్ రేడియో ఫ్రిక్వెన్సీలో ఈ సమాచారాన్ని అందించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. భవిష్యత్తులో పల్లెల్లోనూ వేగవంతమైన ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావచ్చని పరిశోధకులంటున్నారు. 250 ఇంటర్నెట్ కనెక్షన్లు ఒక సెకనుకు 24 మెగాబైట్ల సమాచారాన్ని పంపగల్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

Advertisement
Advertisement