అలా చేయకపోతే.. వాట్సాప్‌ డిలీట్‌ | Sakshi
Sakshi News home page

అలా చేయకపోతే.. వాట్సాప్‌ డిలీట్‌

Published Fri, Feb 10 2017 7:46 PM

అలా చేయకపోతే.. వాట్సాప్‌ డిలీట్‌

ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన క్షణాల్లో అందరికి చేరేలా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా పాపులారిటీ పొందుతున్న వాట్సాప్‌, తమ కస్టమర్ల అకౌంట్లకు సెక్యూరిటీని కట్టుదిట్టం చేసే పనిలో పడింది. చాటింగ్‌, ఫోన్‌ కాల్స్‌, వీడియో కాలింగ్‌లతో పాటూ ఫోటోలు, వీడియోలు, ఫైళ్ల షేరింగ్‌ వంటి ఆఫ్షన్‌లతో దూసుకుపోతున్న వాట్సాప్‌, తమ కస్టమర్ల ఖాతాల భద్రత కోసం రెండంచెల వెరిఫికేషన్‌ను ప్రవేశపెట్టబోతున్నట్టు వెల్లడించింది. దశల వారీగా ఈ ఫీచర్‌ను గత ఏడాది నవంబర్‌ నుంచి టెస్ట్‌ చేస్తున్నారు.

ఈ ఫీచర్‌ను వినియోగించుకోవాలంటే వాట్సాప్‌కు లాగిన్‌ అయిన తర్వాత సెట్టింగ్స్‌కు వెళ్లాలి. అనంతరం అకౌంట్‌లోకి వెళ్తే అక్కడ 'టూ స్టెప్‌ వెరిఫికేషన్‌' ఆప్షన్‌(త్వరలో రానుంది) ఉంటుంది. ఆ ఆప్షన్‌ క్లిక్‌ చేసిన తర్వాత ఆరు డిజిట్ల సెక్యురిటీ కోడ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఫోన్‌ నెంబర్‌ వెరిఫికేషన్‌(టెక్ట్స్‌ మెసేజ్‌ లేదా వాయిస్‌ కాల్‌ ద్వారా చేసే వెరిఫికేషన్‌)కు అదనం.

వాట్సాప్‌ యూజర్లు ఈ ఆరు డిజిట్ల కోడ్‌ను ప్రతి ఏడు రోజులకోకసారి ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. సెక్యురిటీ కోడ్‌ మర్చిపోయినప్పుడు తిరిగి కోడ్‌ పొందాలంటే వాట్సాప్‌ యూజర్లు తమ మెయిల్‌ అకౌంట్‌ను వాట్సాప్‌ రిజిస్టర్‌ చేయాలి. అలా చేస్తే సంబంధిత మెయిల్‌కు సెక్యురిటీ కోడ్‌ వస్తుంది. అయితే మెయిల్‌ రిజిస్టర్‌ చేసినప్పుడు శ్రద్ధ వహించాలని వాట్సాప్‌ యాజమాన్యం తెలిపింది. మెయిల్‌ వెరిఫికేషన్‌ ఉండదు కాబట్టి రిజిస్టర్‌ సమయంలో మెయిల్‌ అడ్రస్‌లో తప్పులు లేకుండా చూడాలని పేర్కొంది.

ఎవరైనా మెయిల్‌ అడ్రస్‌తో రిజిస్టర్‌ చేసుకోకపోయినా తిరిగి తమ వాట్సాప్‌ అకౌంట్‌ను లాగిన్‌ అవ్వొచ్చని, కాకపోతే సదరు మొబైల్‌ నెంబర్‌ను రీవెరిఫై చేయడానికి ఏడురోజుల సమయం పడుతోందని వెల్లడించింది. ఆ ఏడు రోజుల తర్వాత కూడా పాస్‌ కోడ్‌ లేకుండానే రీవెరిఫై చేసి లాగిన్‌ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ, ఇలా చేస్తే పెండింగ్‌లో ఉన్న డేటా మొత్తం డిలీట్‌ అవుతుంది.

ఏడు రోజుల్లో రీవెరిఫై చేయకుండా, 30 రోజుల కన్నా ఎక్కువ సమయం తీసుకుంటే అకౌంట్‌ పూర్తిగా డిలీట్‌ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో తిరిగి కొత్తగా మళ్లీ అదే నెంబర్‌తో కొత్త అకౌంట్‌ తీయాల్సి ఉంటుందని వాట్సాప్‌ తెలిపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement