బార్సిలోనాపై టెర్రరిస్టుల దాడులెందుకు?

18 Aug, 2017 17:51 IST|Sakshi
బార్సిలోనాపై టెర్రరిస్టుల దాడులెందుకు?

సాక్షి, న్యూఢిల్లీ: స్పెయిన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైనందునే బార్సిలోనాను ఇస్లామిక్‌ తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకొని దాడి జరిపారు. కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకొని ఆధునిక తుపాకులు, బాంబులతో జనాలలోకి చొచ్చుకు పోవడం కుదరడంలేదు కనుకనే టెర్రరిస్టులు జనంపైకి వాహనాలను నడపడం ద్వారా దాడులకు పాల్పడుతున్నారు. అందుకే పర్యాటకులు లేదా జన సాంధ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. టెర్రరిస్టులు తొలిసారిగా ఈ తరహ దాడిని ప్రాన్స్‌లోని నైస్‌ సిటీపై 2016లో దాడిచేశారు. అదే ఏడాది బెర్లిన్‌లో దాడి చేశారు. ఈ ఏడాది లండన్‌లో ఇప్పుడు బార్సిలోనాలో దాడి చేశారు. తాజా దాడిలో 13 మంది మరణించగా, ఎక్కువ మంది గాయపడ్డారు.

2001 సంవత్సరంలో అల్‌ఖాయిదా టెర్రరిస్టులు న్యూయార్క్, వాషింగ్టన్‌ నగరాలపై వైమానిక దాడులు జరిపి కొత్త పంథాను అనుసరించిన విషయం తెల్సిందే. ఆ దాడుల్లో అపార ప్రాణ నష్టం జరగడంతో ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాల వద్ద పటిష్టమైన భద్రతాను ఏర్పాటు చేయడంతో ముంబు నగరంపై మరో రకంగా దాడులకు పాల్పడ్డారు. వివిధ దేశాలు అనుసరిస్తున్న భద్రతా చర్యలను దృష్టిలో పెట్టుకొని టెర్రరిస్టులు ఎప్పటికప్పుడు తమ దాడుల పంథాను మార్చుకుంటున్నారు.

నైస్‌ దాడి అనంతరం బెర్లిన్‌ నగరంలో కూడా వాహనంతో దాడి జరగడంతో పలు పాశ్చాత్య దేశాలు పర్యాటక లేదా ఉత్సవాల సందర్భంగా ప్రజలు ఒకే చోట ఎక్కువగా గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకుంటునారు. ప్రజలు గుంపులుగా ఉండే ప్రాంతాలకు ఎక్కువ దూరంలోనే వాహనాలు నిలిపివేసి వాటి వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ బార్సిలోనాలో దాడి జరగడం దురదృష్టకరం.

సిరియాలో ఎక్కువగా ఉన్న ఇస్లామిక్‌ ఉగ్రవాదులనును ర క్కా ప్రాంతం నుంచి కూడా తరిమేసినందున పాశ్చాత్య దేశాలపై వారి దాడులు తగ్గుతాయని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. అయితే పాశ్చాత్య దేశాల కారణంగానే సిరియాలో తాము పట్టుకోల్పోయామని భావిస్తున్న ఇస్లామిక్‌ ఉగ్రవాదులు అసహనంతో ఇంకా ఎక్కువ దాడులు జరిపేందుకు ప్రయత్నిస్తారు. టెర్రరిస్టుల అణచివేతలో ఇంగ్లండ్, ఫ్రాన్స్‌తోని చేతులు కలిపినందునే ఇప్పుడు తాము స్పెయిన్‌పై దాడి చేశామని ఇస్లామిక్‌ ఉగ్రవాదులు ప్రకటించుకోవడం ఇక్కడ గమనార్హం.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా