మహిళల చర్మం చల్లగా ఎందుకుంటుంది? | Sakshi
Sakshi News home page

మహిళల చర్మం చల్లగా ఎందుకుంటుంది?

Published Tue, Sep 6 2016 6:34 PM

మహిళల చర్మం చల్లగా ఎందుకుంటుంది?

ముట్టుకుంటే మహిళల చర్మం చల్లగా ఉంటుంది. మగవాళ్ల చర్మం వెచ్చగా ఉంటుంది. ఎందుకు? వెచ్చటి రక్తం ప్రవహించే రక్తనాళాలు ఆడవారికి చర్మం ఉపరితలానికి దూరంగా (లోతుగా) ఉంటాయి. మగవాళ్లకు రక్తనాళాలు చర్మం ఉపరితలానికి దగ్గరగా ఉంటాయి. మరో కారణం.. వేడిని ఉత్పత్తి చేసే జీవక్రియ మగవాళ్లలో వేగంగా ఉంటుంది. ఆడవాళ్లలో మెల్లగా ఉంటుంది. ఆడవాళ్లతో పోలిస్తే మగవాళ్లకు జీవక్రియ 25 నుంచి 32 రెట్లు ఎక్కువగా ఉంటుంది. వేడి ఉత్పత్తి కూడా తక్కువగానే ఉంటుంది.

మగావాళ్లలో చర్మం అమరిక, కండరం బరువులో కూడా తేడా ఉంటుంది. మహిళలతో పోలిస్తే మగవాళ్ల చర్మం కొంచెం మందంగా, చమురుగా ఉంటుంది. కండరాల బరువు కూడా మగవాళ్లలో ఎక్కువ. మహిళల హార్మోన్లలో కూడా హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. వారిలో రక్తం వేడిని ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు థైరాయిడ్‌ గ్రంధి ఎక్కువ క్రియాశీలకంగా పనిచేస్తుంది. అందుకే మహిళల్లో థైరాయిడ్‌ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

మగవారు, మహిళల్లో ఉన్న ఈ తేడాల వల్లనే ఒకరి చర్మం వెచ్చగాను, ఒకరి చర్మం చల్లగాను ఉంటుంది. మహిళల గర్భాశయం వెచ్చగా ఉండేందుకు, మగవాళ్ల జననాంగాలు చల్లగా ఉంటేందుకు ప్రకృతి సిద్ధంగా సంక్రమించిన శారీరక ధర్మాలివి. పుట్టే పిల్లల కోసం గర్భాశయాన్ని వెచ్చగా ఉంచడమే మహిళల శారీరక ధర్మం.

Advertisement
Advertisement