భూకంపాన్ని ‘రుచి’ చూస్తారా? | Sakshi
Sakshi News home page

భూకంపాన్ని ‘రుచి’ చూస్తారా?

Published Sat, Apr 25 2015 5:45 AM

భూకంపాన్ని ‘రుచి’ చూస్తారా?

 భూకంపం వస్తే ఎవరైనా ఏం చేస్తారు.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరు గులు తీస్తారు.. కాని స్పెయిన్‌లో మాత్రం భూకంపమొచ్చినా.. భేషుగ్గా భోంచేస్తారు. అక్కడి ‘డిజాస్టర్ కేఫ్’ ప్రత్యేకత అదేమరి. తీవ్ర భూకంపం వస్తుండగా విందు ఆరగిస్తూ అనుభూతి చెందాలనుకునే వారి కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గుహలాగా ఉండే గదిలో 7.8 తీవ్రత కలిగిన ప్రకంపనలు వస్తుండగా అక్కడి సిబ్బంది భోజనం వడ్డిస్తుంది. పళ్లెంలోని ఆహార పదార్థాలు కింద పడకుండా జాగ్రత్తగా తినడం కస్టమర్ల వంతు.  ఇక్కడ సీటు బుక్ చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో తెగ పోటీ పడుతున్నారట.
 

Advertisement
Advertisement