చేపముక్క కొరికితే.. | Sakshi
Sakshi News home page

చేపముక్క కొరికితే..

Published Fri, Feb 26 2016 3:17 PM

Woman bites down on rare purple pearl worth $800 while eating seafood at an Italian restaurant

వాషింగ్టన్ : జిహ్వ రుచి తీర్చుకోవాలంటే ఎవరమైనా  ఓ మంచి రెస్టారెంట్ కి వెళతాం.. అక్కడ.. మనసుకు నచ్చిన ఆహారాన్నిఆర్డర్ చేస్తాం.. ఆనక సుష్టుగా భోంచేస్తాం కదా.. అమెరికాలోని  ఆహార ప్రియులైన ఓ దంపతులు కూడా ఇలాగే చేశారు.  కానీ అక్కడ వారికి ఎదురైన అనుభవం తెలిస్తే..ఆశ్చర్యం పోవడం మనవంతు అవుతుంది.


ఇంతకీ ఏం జరిగిందంటే... వాషింగటన్ కు చెందిన  లిండ్సే అనేమహిళ భర్త క్రిస్ తో   కలిసి ఓ ఇటాలియన్   హెటల్ కి వెళ్లి సీ ఫుడ్ ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసిన   ఆ సీ ఫుడ్ తింటూ వుండగా   లిండ్సే పంటికింద గట్టిగా  తగిలింది.    పరిశీలించిన మీదట..  
దాన్ని చేబులో వేసుకొని చక్కా వచ్చారు. అనంతరం జెమ్మాలజిస్టుకు చూపించారు.  ఉత్తర అమెరికాలోని అట్లాంటిక్ సముద్రతీరంలోదొరికే అతివిలువైన  ముదురు వంకాయరంగు ముత్యం (పర్పుల్ పెరల్ )గా తేల్చారు. దీని విలువ  600 డాలర్ల విలువ ఉటుందని తేల్చారు. అంటే  సుమారు 41వేల రూపాయలన్నమాట.  లక్షల్లో ఒకటిగా లభించే అరుదైన పర్పుల్  ముత్యమని జియోలాజికల్ లాబ్ ప్రతినిధి టెడ్ ఇర్విన్  చెప్పారు. దీంతో లిండ్సే సంతోషంలో మునిగితేలుతోంది. ఆ అరుదైన ముత్యంతో మంచి  హారం తయారు చేయించుకుంటానంటూ మురిసిపోతోంది.

Advertisement
Advertisement