Sakshi News home page

ఆమె 'మరీ యంగ్‌'గా ఉందని..!

Published Tue, Sep 26 2017 3:26 PM

woman detained for being 'too young' - Sakshi

న్యూయార్క్‌: అందంగా 40 ఏళ్ల వయస్సులోనూ 20 ఏళ్ల అమ్మాయిగా కనిపించే నటాలియా డెన్‌కివ్‌కు ఇటీవల న్యూయార్క్‌ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. అనూహ్యంగా ఎయిర్‌పోర్టు అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని.. కొన్ని గంటలపాటు ప్రశ్నించారు. ఎందుకంటే 41 ఏళ్ల నటాలియా 20 ఏళ్ల యువతిలా అందంగా కనిపించడమే చిక్కులు తెచ్చిపెట్టింది. దీంతో వేరేవారి పాస్‌పోర్టుతో నటాలియా ప్రయాణిస్తుందేమోనని అనుమానించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది.. ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.

టర్కీ నుంచి స్వదేశానికి తిరిగొస్తుండగా నటాలియాకు ఈ అనుభవం ఎదురైంది. పిన్న వయస్కురాలిలాగా కనిపించడంతో ఎయిర్‌పోర్టు అధికారులు తనను ప్రశ్నించారని, ఇది సాధారణ ప్రశ్నించడంలాగా కాకుండా.. తను కనిపించేతీరుకు ప్రశంసనీయంలాగా కనిపించిందని ఆమె మీడియాకు తెలిపారు. 'నేను అందంగా యవ్వనంగా కనిపించడంపై గతంలో ఎన్నో ప్రశంసలు దక్కాయి. కానీ, ఇలా కనిపించడమే ఒకరోజు ఇలాంటి చిక్కులు తీసుకొస్తుందని నేను అనుకోలేదు' అని నటాలియా తెలిపారు. నటాలియా 'లామా' పేరుతో ప్రసిద్ధురాలు. ఎయిర్‌పోర్టులో ఆమె కనిపించడంతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement