విమానంలో టాయిలెట్ డోర్‌ ఓపెన్‌ చేయబోయి.. | Sakshi
Sakshi News home page

విమానంలో టాయిలెట్ డోర్‌ ఓపెన్‌ చేయబోయి..

Published Sun, Jun 9 2019 4:52 PM

Woman On Pakistan Airlines Flight Opens Emergency Exit Door Thinking It Toilet - Sakshi

ఇస్తామాబాద్‌ : విమానాన్ని దూరం నుంచి చూసే వాళ్లు ఎక్కువ కానీ దాంట్లో ప్రయాణించే వారు చాలా తక్కువ. విమానం లోపలి భాగం ఎలా ఉంటుంది.. దాంట్లో ఉన్న సదుపాయాలు ఏంటి.. అనే విషయాలు అందరికి తెలియకపోవచ్చు. తొలిసారి విమాన ప్రయాణం చేసే వారికి కూడా అన్ని విషయాలు తెలియవు. దాని వల్ల కొన్ని సార్లు ప్రయాణికులకూ ఇబ్బందులు కలుగుతాయి. తాజాగా తొలిసారి విమానం ఎక్కిన ఓ పాకిస్తానీ మహిళ చేసిన పని ప్రయాణికుల్లో ఆందోళ కలిగించింది.

ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ సిటీ నుంచి పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్ వెళ్తున్నపాకిస్తాన్ ఇంటర్నేషన్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)కు చెందిన విమానం టేకాఫ్ తీసుకోవడానికి రన్ వేపై వేగం అందుకుంటుండగా ఓ మహిళ తన సీట్లోంచి హడావుడిగా లేచి నేరుగా వెళ్లి ఎమర్జెన్సీ డోర్ తీశారు. దీంతె విమానం తలుపు తెరుచుకొని వార్నింగ్ అలారం మోగింది. ముందుజాగ్రత్తగా ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నాయి. ఇక విమానంలో ఉన్న ఇతర ప్రయాణికుల సంగతి చెప్పనక్కర్లేదు. భయంతో వణికిపోయారు. ఏం జరుగుతుందో అర్థంకాక హడలిపోయారు. దాంతో విమానాన్ని సిబ్బంది నిలిపివేసి ప్రయాణికులను ఎయిర్ పోర్ట్ లాంజ్ లోకి పంపారు. ఇక, ఆ మహిళను ప్రశ్నించగా, తాను టాయిలెట్ కు వెళ్లాలనుకుని డోర్ తెరిచానని, అది ఎమర్జెన్సీ డోర్ అనుకోలేదని తెలిపారు. ఏదైతేనేమి, ఆ మహిళ చేసిన పనికి పీఐఏ విమానం ఏడు గంటలు ఆలస్యంగా బయల్దేరి వెళ్లింది.

Advertisement
Advertisement