ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ ఇదే.. | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ ఇదే..

Published Mon, Mar 20 2017 10:02 AM

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ ఇదే..

ఆమ్‌స్టర్‌డ్యాం: ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయాల జాబితా 2017లో సింగపూర్‌లోని చాంగీ విమానాశ్రయం మరోసారి టాప్‌లో నిలిచింది. స్కైట్రాక్స్‌ వరల్డ్‌ ఎయిర్‌పోర్ట్ అవార్డ్స్‌  జాబితాలో చాంగీ విమానాశ్రయం వరుసగా ఐదోసారి టాప్‌లో నిలవడం గమనార్హం. లక్షలాది మంది విమాన ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించి రూపొందించిన ఈ జాబితాను ఇటీవల ఆమ్‌స్టర్‌డ్యాంలో విడుదల చేశారు.

దీనిపై చాంగీ ఎయిర్‌పోర్ట్‌ సీఈవో లి సివో హియాంగ్‌ స్పందిస్తూ.. స్కైట్రాక్స్‌ బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ అవార్డ్‌ను వరుసగా ఐదోసారి గెలుచుకోవడం చాంగీ ఎయిర్‌పోర్ట్‌ కమ్యూనిటీకి మరింత ప్రోత్సాహాన్నిస్తుందన్నారు. ఈ జాబితాలో టోక్యో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ రెండోస్థానంలో నిలిచింది. కాగా, అమెరికా విమానాశ్రయాల్లో సిన్సినాటి(నార్తర్న్‌ కెంటకీ) విమానాశ్రయం అత్యుత్తమంగా 26వ ర్యాంకులో నిలిచింది.  విమానాశ్రయాల్లో ప్రయాణికులకు అందించే సేవలు, పరిశుభ్రత, అహారం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని స్కైట్రాక్స్‌ రూపొందించిన జాబితాలో టాప్‌ 10 లో నిలిచినవి ఇవి...

1. సింగపూర్‌ చాంగీ విమానాశ్రయం
2. టోక్యో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌(జపాన్‌)
3. ఇంచియాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌(సియోల్‌, దక్షిణ కొరియా)
4. మ్యూనిచ్‌ ఎయిర్‌పోర్ట్‌(జర్మనీ)
5. హాంకాంగ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌
6. హమద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌(దోహా, ఖతార్‌)
7. చుబు సెంట్రెయిర్‌ నగొయా(జపాన్‌)
8. జ్యూరిచ్‌ ఎయిర్‌పోర్ట్‌(స్విట్జర్లాండ్‌)
9. లండన్‌ హీత్రూ విమానాశ్రయం
10. ఫ్రాంక్‌ఫర్డ్‌ ఎయిర్‌పోర్ట్‌(జర్మనీ)

Advertisement
Advertisement