ప్రపంచ పెద్దావిడ అమెరికాలో ఉంది | Sakshi
Sakshi News home page

ప్రపంచ పెద్దావిడ అమెరికాలో ఉంది

Published Mon, Jul 6 2015 5:42 PM

World's Oldest Living Person in US Turns 116

న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యంత వయస్సు కలిగిన మహిళగా అమెరికాకు చెందిన ఓ మహిళ నిలిచింది. ఆమె సోమవారం 116వ పుట్టిన రోజు జరుపుకోవడం ద్వారా ప్రపంచంలోనే అత్యంత వృద్ధమహిళగా గుర్తింపుకెక్కింది. గిన్సీస్ వరల్డ్ రికార్డ్స్లో చోటుదక్కించుకుంది. న్యూయార్క్లోని బ్రూక్లిన్కు చెందిన ముషాత్ జోన్స్ అనే మహిళ గిన్నీస్ వరల్డ్స్ రికార్డు ప్రకారం జూలై 6, 1899లో జన్మించింది.

ఆమె తన బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య ఎంతో సంబురంగా 116వ పుట్టిన రోజు వేడుకను జరుపుకుంది. గతంలో అత్యంత వృద్ధ మహిళగా జెరాలియన్ టాలీ అనే మహిళ పేరిట ఉండగా ఆమె గత జూన్ 17న కన్నుమూశారు. దీంతో తాజాగా జోన్స్ కు ఈ ఘనత తగ్గింది. ఆమె శారీరక సామర్ధ్యం గురించి ప్రశ్నించగా.. తనకు కనుచూపు మందగించి చెవులు కూడా వినిపించడనప్పటి నుంచి మంచానికి

పరిమితమయ్యానని, ఏ దిగులు దగ్గరికి రానీయకుండా చక్కగా నిద్రపోయేదానినని తెలిపింది. రోజుకు రెండు పూటలే మెడిసిన్ తీసుకుంటానని కూడా వివరించింది.  
 

Advertisement
Advertisement