రోతపుట్టించే కుక్కకు అబ్బురపడే అవార్డు | Sakshi
Sakshi News home page

రోతపుట్టించే కుక్కకు అబ్బురపడే అవార్డు

Published Fri, May 13 2016 1:59 PM

రోతపుట్టించే కుక్కకు అబ్బురపడే అవార్డు

లండన్: ప్రపంచంలోనే అత్యంత రోతపుట్టించే మగ్లీ అనే కుక్క అరుదైన అవార్డును దక్కించుకుంది. గత ఆరేళ్లుగా చేస్తున్న సామాజిక సేవకు గుర్తింపుగా ఇంగ్లాండ్ నుంచి 'సూపర్ హీరో అవార్డు'కు ఎంపికైంది. చైనా బ్రీడ్ కు చెందిన మగ్లీ అనే ఈ పన్నేండేళ్ల కుక్కకు 2012లో ప్రపంచంలోనే రోత కుక్కగా అవార్డును దక్కించుకుంది.

అంతకుముందు 2005లో బ్రిటన్లో అగ్లియెస్ట్ డాగ్ గా నిలిచింది. ఇది గత ఆరేళ్లుగా ఓ స్వచ్ఛంద సంస్థ తరుపున వైకల్యంగలవారికి, పెద్దలకు ఓ థెరపీ పెట్ యానిమల్గా పనిచేస్తోంది. దీంతో గతవారం జరిగిన జాతీయ పెంపుడు జంతువుల ప్రదర్శన కార్యక్రమంలో మగ్లీని ఈ ఏడాది సూపర్ డాగ్ అవార్డుకు ఎంపికచేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement
Advertisement