పెద్దలకు మాత్రమే...! | Sakshi
Sakshi News home page

పెద్దలకు మాత్రమే...!

Published Sun, Jun 18 2017 12:31 AM

పెద్దలకు మాత్రమే...!

ఇక్కడ పెద్దలకు మాత్రమే అన్నది సినిమాలకు కాదు.. ఉద్యోగాలకు.. దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఉన్న ‘ఎవర్‌ యంగ్‌’కంపెనీలో ఉద్యోగం కావాలంటే.. మీ వయసు 55 ఏళ్లు నిండి ఉండాల్సిందే! ఇక్కడ 400 మందికి పైగా పనిచేస్తుండగా.. వారి వయసు 55–83 ఏళ్ల మధ్య ఉంది. దక్షిణ కొరియాలోని కార్పొరేట్‌ సంస్థల్లో రిటైర్‌మెంట్‌ వయసు(60 ఏళ్లు) రాకుండానే.. ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి పదవీ విరమణ చేయిస్తుంటారట. ఈ చెత్త సంప్రదాయాన్ని మార్చాలనే ఉద్దేశంతో చంగ్‌ ఎన్సంగ్‌ అనే వ్యక్తి 2013లో ఈ కంపెనీని పెట్టారు. యువ ఉద్యోగులతో పోలిస్తే.. ప్రతిభ విషయంలో వీరు ఎందులోనూ తీసిపోరని ఆయన చెబుతున్నారు.

ఈ సంస్థ వెబ్‌సైట్లు, బ్లాగులకు సంబంధించిన కంటెంట్‌ను మానిటర్‌ చేస్తుంది. ‘వయసు మీరిన వారు స్లోగా ఉంటారని.. ముఖ్యంగా కొత్త టెక్నాలజీని నేర్చుకునే విషయంలో వెనుకబడి ఉంటారని అంటుంటారు. అయితే.. మా ఉద్యోగులంతా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతుంటారు’అని ఎన్సంగ్‌ చెప్పారు. వీరి ఆఫీసులో ప్రతి 4 గంటలకు ఒక షిఫ్ట్‌.. ప్రతి 50 నిమిషాలకు ఓ 10 నిమిషాల బ్రేక్‌ ఉంటుంది. ఈ టైంలో ఉద్యోగులు ప్యాంట్రీలో ఉంచిన ఆహార పదార్థాలను తింటూ ఎంజాయ్‌ చేయవచ్చు. ‘ఇక్కడ రోజూ కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి చాన్స్‌ ఉంటుంది. దీని వల్ల మరుసటి రోజు నేను మరింత ఉత్సాహంగా పనికి రావడానికి ఇది దోహదపడుతుంది’అని 83 ఏళ్ల ఉద్యోగి ఒకరు ఆనందంగా చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement