సున్నా.. మరో 500 ఏళ్లు వెనక్కి! | Sakshi
Sakshi News home page

సున్నా.. మరో 500 ఏళ్లు వెనక్కి!

Published Fri, Sep 15 2017 9:59 AM

సున్నా.. మరో 500 ఏళ్లు వెనక్కి!

సాక్షి, న్యూఢిల్లీ: అంకెలకు ముందు, వెనక స్థానానికి సున్నా(0)ను చేర్చటం-మార్చటం ద్వారా ఆ విలువ చాలా చాలా మారిపోతుంటుంది. అంతంటి విలువైన సున్నా అనే అంకెను మన భారతీయులే కనిపెట్టారన్నది మనకు గర్వకారణమైన విషయం. ప్రాచీన మయన్స్‌, బాబిలోనియన్స్‌ లాంటి సాంప్రదాయల నుంచి కాకుండా క్రీస్తు శకం 628లో భారతీయ గణిత శాస్త్రవేత్త బ్రహ్మగుప్త కనిపెట్టిన సున్నాకే విలువ ఇచ్చి చెలామణిలోకి తీసుకొచ్చారు.
 
అయితే ఇప్పుడు దానిని కూడా మరో 500 ఏళ్ల ప్రాచీనతత్వాన్ని ఆపాదించేస్తూ ఆధారాలతో సహా నిరూపించేశారు ఆక్సఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. ప్రాచీన తక్షశిల(ప్రస్తుతం పెషావర్‌ సమీపంలో ఉంది) నుంచి 1881 లో సేకరించిన బఖ్షలి మనులిపి 1902 నుంచి ఆక్స్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఉంచారు. కార్బన్‌ డేటింగ్ ఆధ్యయనం ద్వారా ఆ లిపిపై అక్షరాల క్రమం కనుగొన్న శాస్త్రవేత్తలు, అందులో 0 కు సంబంధించిన ఆధారాలను చూపించేస్తున్నారు.  
 
ఇంతకు ముందు 9 శతాబ్దానికి చెందిన మనుస్మృతి లిపి ద్వారా  సున్నా అనే అక్షరాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. బ్రహ్మగుప్తుడు రచించిన బ్రాహ్మస్ఫుటసిద్ధాంతం నుంచి దానిని స్వీకరించినట్లు చెప్పారు. అయితే బఖ్షలి లిపి మాత్రం 224 నుంచి 383 క్రీశ శకాల మధ్య కాలానికి చెందినది చెందినదిగా చెబుతున్నారు. ఆ లెక్కన ఇంతకు ముందు చెప్పుకున్న దానికంటే 500 ఏళ్ల క్రితమే సున్నా వాడకంలో ఉండేదని మర్కస్‌ డు సౌతోయి అనే గణిత శాస్త్ర పరిశోధకుడు చెబుతున్నారు. బఖ్షలి లిపిలో చుక్క రూపంలో ఉన్నప్పటికీ తర్వాత కాలక్రమేణా అది సున్నాగా రూపాంతరం చెందిందని ఆయన అంటున్నారు.

Advertisement
Advertisement