ఫేస్బుక్ సంచలన నిర్ణయం | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్ సంచలన నిర్ణయం

Published Wed, May 3 2017 10:25 PM

ఫేస్బుక్ సంచలన నిర్ణయం - Sakshi

కాలిఫోర్నియా : సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ మరో సంచలనానికి తెరలేపనుంది. హింసాత్మక సంఘటనలకు సంబంధించి ఫేస్ బుక్ లైవ్ వీడియోలపై నిఘాను కట్టుదిట్టంచేయనుంది.ఈ మేరకు అదనంగా 3000మందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ బుధవారం ప్రకటించారు. ఫేస్ బుక్ వీడియోలపై వచ్చే లక్షలాది రిపోర్ట్లను వేగవంతంగా రివ్యూ చేయడానికి కసరత్తు చేస్తున్నటు తెలిపారు. సురక్షిత సమాజాన్ని నిర్మించాలంటే, మనం వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందని అయన పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ఫేస్ బుక్లైవ్లో ఆత్మహత్యలు చేసుకోవడంగానీ, హింసాత్మక సంఘటనల టెలీకాస్ట్ ఎక్కువయ్యిందని జుకర్‌బర్గ్ తెలిపారు. ఇవి చాలా బాధాకరమైనవని ఆయన తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు.

అనుచితమైన వీడియోలపై కంప్లైంట్ చేయడానికి ఇప్పటికే ఫేస్బుక్లో 'రిపోర్ట్ వీడియో' ఆఫ్షన్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కంప్లైంట్లను రివ్యూ చేయడం ఆలస్యం అవ్వడం వల్ల సదరు వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడంతో అప్పటికే జరగాల్సిన నష్టం కాస్తా జరిగిపోతోంది. దీంతో అనుచిత వీడియోలను తొలగించే ప్రక్రియను ఫేస్ బుక్ వేగవంతం చేసింది. ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా లేదా, అప్లోడ్ ద్వారా కానీ ఫేస్ బుక్లోకి వచ్చే వీడియోలను పర్యవేక్షించడానికి కొత్తగా రిక్రూట్ అయిన వారు ఉపయోగపడనున్నారు

Advertisement
Advertisement