బిజినెస్‌లో నష్టం వచ్చింది...అప్పుడు తను!

2 Mar, 2020 15:45 IST|Sakshi

డియర్‌ ‘సాక్షి’ నేను నా ఫ్రెండ్స్‌ స్టోరీని చెప్పాలనుకుంటున్నాను.నా స్కూల్‌ డేస్‌లో నాకు ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిద్దరు నాకు చాలా క్లోజ్‌. ముగ్గురం కలసి ఒకే చోట తినేవాళ్లం, చదువుకునే వాళ్లం. నా ఫ్రెండ్స్‌ ఇద్దరు వరుసకు బావ మరదళ్లు అవుతారు. మేం డిగ్రీ వరకు కలిసే చదువుకున్నాం. డిగ్రీ అయ్యాక నా స్నేహతురాలికి పెళ్లి చేయలానుకున్నారు. అప్పుడు వాళ్లిద్దరు దూరంమవుతున్నమన్న బాధలో వారిద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని అర్థం చేసుకున్నారు. ఆ విషయం ఇంట్లో చెప్పారు. ఇంట్లో వాళ్లు కూడా వెంటనే ఒప్పుకన్నారు. నా స్నేహితుడికి చదువు అయిపోయిన వెంటనే జాబ్‌ వచ్చింది. వెంటనే పెళ్లి చేసుకున్నారు. వాళ్ల జీవితం చాలా చక్కగా సాగిపోతున్న సమయంలో నా ఫ్రెండ్‌ బిజినెస్‌ స్టాట్‌ చేశాడు. 
అది మూడు సంవత్సరాలు బాగానే కలిసొచ్చింది. కానీ తరువాత చాలా నష్టాలు వచ్చాయి. ఆ టైంలో నా స్నేహితురాలు తనకు చాలా సపోర్టు ఇచ్చింది. తను లేకపోతే సూసైడ్‌ చేసుకునే వాడేమో. తరువాత బిజినెస్‌ వదిలేసి జాబ్‌లో జాయిన్‌ అయ్యాడు. వాళ్లకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు. అంతా చక్కగా సాగిపోతున్న సమయంలో ఆ దేవుడికి కన్ను కుట్టిందేమో నా స్నేహితురాలికి క్యాన్సర్‌ అని తెలిసింది. ఆ విషయం తనకు చెప్పకుండా నా ఫ్రెండ్‌ ట్రీట్‌మెంట్ ఇప్పించేవాడు. కానీ రెండు సంవత్సరాల తరువాత తను దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది. తను ఆ బాధను పంటిబిగువన భరిస్తూ ఇద్దరి పిల్లల్ని చూసుకుంటూ అలానే ఉంటున్నాడు. నేను ‘సాక్షి’ ద్వారా తనకు చెప్పాలనుకుంది ఒక్కటే మీ లైఫ్‌ మళ్లీ కొత్తగా మొదలు పెట్టండి. మీరు జీవితంలో ఇంకా ఉన్నతస్థాయికి చేరుకోవాలి. దానికి మీకు ఒక తోడు కావాలి. మీ ముఖం మీద మీ హృదయం నుంచి వచ్చే చిరునవ్వు ఉండాలి.

ఇట్లు 
మీ చిన్ననాటి స్నేహితురాలు
మీనాక్షి.  

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు