ఫైనల్‌గా లావణ్యకే? | Sakshi
Sakshi News home page

ఫైనల్‌గా లావణ్యకే?

Published Fri, Jun 30 2017 12:50 AM

ఫైనల్‌గా లావణ్యకే?

‘దటీజ్‌.... మహాలక్ష్మి’ అంటున్నారు సొట్ట బుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి. ఇంతకీ మహాలక్ష్మి ఎవరు? అనేగా మీ డౌట్‌. అసలు విషయానికొస్తే.. నాగచైతన్య, తమన్నా జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘100% లవ్‌’లో ‘దటీజ్‌.. మహాలక్ష్మి’ అంటూ తమన్నా చేసిన సందడి అంతా ఇంతా కాదు.

ఇప్పుడు మహాలక్ష్మి పాత్రలో లావణ్య సందడి చేయనున్నారట. జీవీ ప్రకాష్‌ హీరోగా  ‘100% లవ్‌’  తమిళంలో రీమేక్‌ కానుంది. ఇందులో హీరోయిన్‌గా తమన్నా పేరు వినిపించినా లావణ్యా త్రిపాఠిని ఓకే చేసినట్లు్ల వార్తలొచ్చాయి. ఆ తర్వాత హెబ్బా పటేల్‌ పేరు వినిపించింది. ఇంతకీ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠీనా? హెబ్బానా? అనే తికమక ఉండేది. చివరకు లావణ్యనే ఫైనల్‌ చేశారట.

Advertisement
Advertisement