ఇప్పటికీ తారక్‌ను తిట్టుకుంటుంటా! - రాజమౌళి | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ తారక్‌ను తిట్టుకుంటుంటా! - రాజమౌళి

Published Tue, Sep 27 2016 11:45 PM

ఇప్పటికీ తారక్‌ను తిట్టుకుంటుంటా! - రాజమౌళి - Sakshi

ఎడిటింగ్ అసిస్టెంట్‌గా కెరియర్ ప్రారంభించిన రాజమౌళి పాతికేళ్లు పూర్తి చేసుకున్నారు. డెరైక్టర్‌గా పదిహేనేళ్ల ప్రస్థానం కంప్లీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన తెరకెక్కించిన ‘స్టూడెంట్ నెం.1’ సినిమా 2000లో సెప్టెంబర్ 27న విడుదలైంది.
 
  తాజాగా రాజమౌళి ఆ సంగతులు పంచుకుంటూ, ‘‘స్విట్జర్లాండ్‌లో ‘స్టూడెంట్ నెం.1’ షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు, తారక్‌కు (జూనియర్ ఎన్టీఆర్) ఒకే రూమ్. నాకేమో 9 గంటలకే పడు కునే అలవాటు. తారక్ అర్ధరాత్రి 12 వరకూ టీవీ చూసేవాడు. ఆ టీవీలో వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమం స్విస్ భాషలో వస్తుండేది. ఆ విషయం గుర్తుకొస్తే ఇప్పటికీ తారక్‌ని తిట్టుకుంటుంటా’’ అన్నారు. ‘‘ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశం మిన హా మిగిలిన సన్నివేశాల్లో నాకు దర్శకత్వ అనుభవం లేని విషయం తెలుస్తుంది. 
 
 సక్సెస్ టూర్‌లో 19 ఏళ్ల తారక్‌ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, పెద్ద వయసు వారూ రావడం మరచిపోలేని అనుభూతి’’ అని రాజమౌళి పేర్కొన్నారు. చిన్న ఎన్టీఆర్ స్పందిస్తూ, ‘‘పదిహేనేళ్ల క్రితం వర్ధమాన దర్శకుడిగా జర్నీ ప్రారంభించిన నా జక్కన్న దేశంలో అత్యంత గౌరవనీయమైన దర్శకులు. ఆయనకు సుదీర్ఘ ప్రయాణం ఉంది’’ అని అన్నారు. 
 

Advertisement
Advertisement