26తో 26 కంప్లీట్‌ | Sakshi
Sakshi News home page

26తో 26 కంప్లీట్‌

Published Wed, Jun 27 2018 12:26 AM

26 years of Shah Rukh Khan in showbiz - Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ సిల్వర్‌ స్క్రీన్‌ మీదకు ఎంట్రీ ఇచ్చి జూన్‌ 26తో 26 ఏళ్లు కంప్లీట్‌ అయింది. ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్‌ కుచ్‌ హోతా హై, చక్‌ దే ఇండియా’ వంటి అద్భుతమైన సినిమాలను సినీ అభిమానులకు అందించారాయన. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 26 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ జర్నీ గురించి షారుక్‌ మాట్లాడుతూ – ‘‘ఈ 26తో ఇంకొకరిలా (తనలోని నటుడు గురించి) ఉండటం మొదలై 26 ఏళ్లు అవుతోంది.

అంటే నా లైఫ్‌లో సగం అన్నమాట (షారుక్‌ వయసు 52). నటుడిగా అందరికీ ప్రేమ, సంతోషం, ఆనందం, విషాదం, పడటం, మళ్లీ పైకి లేవడం... ఇలా అన్నీ చూపించాననుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాల్లో మీ అందరి హృదయాల్లో కొంత చోటైనా సంపాదించాను అనుకుంటున్నాను. ఇలాగే జీవితాంతం మీ అందరి హృదయాలను తాకుతూ చెరగని ముద్ర వేయాలనుంది’’ అని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement