లావణ్య త్రిపాఠికి‘100%’ కష్టాలు | Sakshi
Sakshi News home page

లావణ్య త్రిపాఠికి‘100%’ కష్టాలు

Published Thu, Sep 21 2017 7:50 PM

లావణ్య త్రిపాఠికి‘100%’ కష్టాలు

సినీ నటి లావణ్య త్రిపాఠీ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుపోయింది. సోగ్గాడే చిన్నినాయనా, భలే భలే మగాడివోయ్‌ వంటి హిట్‌ చిత్రాలతో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన లావాణ్యకు తాజాగా పెద్ద సమస్య ఎదురైంది. ఈ అమ్మడు నటించడానికి అంగీకరించిన చిత్ర షూటింగ్‌కు డుమ్మా కొట్టడంతో ఆ చిత్ర దర్శక, నిర్మాతలు లావణ్యపై చర్యలకు సిద్దం అయ్యారు.వివరాల్లోకెళ్లితే... తెలుగులో మంచి విజయాన్ని సాధించిన 100% లవ్‌ చిత్రాన్ని తమిళంలో చంద్రమౌళి దర్శకత్వంలో 100% కాదల్‌ పేరుతో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

జీవీ ప్రకాశ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న ఇందులో నటి లావణ్య త్రిపాఠీని నాయకిగా ఎంపిక చేశారు. ఈ చిత్ర షూటింగ్‌ లండన్‌లో నిర్వహించడానికి చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేసింది. అంతా రెడీ అయి చిత్ర యూనిట్‌ లండన్‌కు బయలుదేరుతున్న సమయంలో లావణ్య డమ్మా కొట్టిందట. దీంతో ఆగ్రహం చెందిన చిత్ర దర్శకుడు చంద్రమౌళి.. లావణ్యపై దక్షిణ భాతర సినీ వాణిజ్య మండలిలో పిర్యాదు చేశారు. లావణ్య బాధ్యతారాహిత్యం వల్ల తాము చాలా నష్టపోయామని అందువల్ల ఆమెపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఈ విషయమై దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి స్పందించింది. ఈ చిక్కుల నుంచి ఈ ముద్దుగుమ్మ ఎలా బయట పడుతుందో చూడాలి.

Advertisement
Advertisement