ఎవరిని కాపాడేందుకు ఈ ప్రచారం?

29 May, 2020 20:02 IST|Sakshi

ముంబై: తన భర్త నుంచి భరణం కింద రూ. 30 కోట్లు, నాలుగు గదుల ఫ్లాట్‌ డిమాండ్‌ చేసినట్టు వచ్చిన వార్తలను నవాజుద్దీన్‌ సిద్దిఖీ ​అలియా సిద్ధిఖీ శుక్రవారం ఖండించారు. ఇటీవల నవాజుద్దీన్‌ నుంచి విడాకులు కోరుతూ తన న్యాయవాది ద్వారా అలియా నోటిసులు పంపించిన విషయం తెలిసిందే. నోటీసులో దాదాపు రూ. 30 కోట్లు డిమాండ్‌ చేశారని, తమ పిల్లల పేరు మీద రెండు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లు.. నాలుగు గదుల ఫ్లాట్‌ ఇవ్వాల్సిందిగా పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. (నాకు ఎవరితోనూ సంబంధం లేదు: అలియా)

అవి చూసిన అలియా ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘నకిలీ నోటీసు కాపీతో ఈ ప్రచారం సాగిస్తున్నారు. ఆ తర్వాత దీని వెనక ఎవరు ఉన్నారు, ఎవరిని కాపాడాలని ఇలాంటి వార్తలు పుట్టించారో త్వరలో బహిర్గతం అవుతుంది’ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా పెళ్లైన ఏడాది నుంచే తమ వివాహ జీవితంలో కలతలు మొదలయ్యాయని దీంతో నవాజుద్ధీన్‌తో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు అలియా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మే 7వ తేదీన ఈమెయిల్‌, వాట్సప్‌ ద్వారా నవాజుద్దీన్‌కు లీగల్‌ నోటీసులు పంపించినట్లు ఆమె తరపు న్యాయావాది అభయ్‌ సహే ప్రకటించిన విషయం తెలిసిందే. రంజాన్‌ సందర్భంగా యూపీలో తన స్వగ్రామానికి వెళ్లిన నవాజుద్దీన్ ప్రస్తుతం అక్కడే బంధువులతో ఉన్నట్లు సమాచారం. (అందుకే విడిపోవాలనుకుంటున్నా: అలియా)

మరిన్ని వార్తలు