మాజీ భార్యకు హీరో సర్‌ప్రైజ్‌ | Sakshi
Sakshi News home page

మాజీ భార్యకు టాప్‌ హీరో సర్‌ప్రైజ్‌

Published Wed, Oct 11 2017 10:17 AM

Aamir Khan

ముంబై: ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’  సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న బాలీవుడ్‌ అగ్రనటుడు ఆమిర్‌ఖాన్‌ తన మాజీ భార్య రీనా దత్తను ఊహించని విధంగా ఆశ్చర్యానికి లోనుచేశారు. రీనా 50వ పుట్టినరోజు వేడుకల్లో సడన్‌ ఎంట్రీతో ఆమెను సర్‌ప్రైజ్ చేశారు. తన తాజా చిత్రం ప్రమోషన్‌ కోసం మూడు రోజుల పాటు టర్కీలో పర్యటించి ఆమిర్‌ సోమవారం ఉదయం 6 గంటలకు ముంబై చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి మళ్లీ ప్రచారంలో ముగినిపోయారు.

ఇదే సమయంలో రీనా పిల్లలు జునైద్‌, ఇరా నుంచి ఆయన ఫోన్ వచ్చింది. తమ తల్లి రీనా పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్‌ పార్టీ ఏర్పాటు చేశామని, మీరు కూడా రావాలని ఆమిర్‌ను వారు కోరారు. పిల్లల ఆహ్వానాన్ని మన్నించిన ‘దంగల్‌ స్టార్‌’  సాయంత్రం బర్త్‌ డే పార్టీకి వెళ్లి రీనాను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అంతేకాదు తన భార్య కిరణ్‌రావు కూడా వెంట తీసుకెళ్లాడు. రీనాతో కేక్‌ కట్‌ చేయించి, షాంపేన్‌ బ్యాటిల్‌తో సందడి చేశాడు. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఆమిర్‌ తాజా చిత్రం ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’  ఈనెల 19న విడుదలకానుంది.

Advertisement
Advertisement