రూ.41 కోట్లతో అభిషేక్ బచ్చన్ ఫ్లాట్ | Sakshi
Sakshi News home page

రూ.41 కోట్లతో అభిషేక్ బచ్చన్ ఫ్లాట్

Published Fri, Jan 16 2015 9:29 AM

రూ.41 కోట్లతో అభిషేక్ బచ్చన్ ఫ్లాట్ - Sakshi

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ రూ.41 కోట్లతో ఓ పెద్ద అపార్టుమెంటులో ఫ్లాటు బుక్ చేసుకున్నారు. బాలీవుడ్లో పెద్ద హీరోలందరూ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. అభిషేక్ సొంతం చేసుకోబోతున్న ఆ ఫ్లాటు ఇంకా నిర్మాణ దశలోనే ఉంది.

ఈ ఫ్లాటు మొత్తం విస్తీర్ణం 3875 చదరపు అడుగులు. ఒక్క చదరపు అడుగుకు రూ.1.06 లక్షలు పెట్టి కొన్నారు. వర్లిలోని అనీబిసెంట్ ప్రధాన మార్గంలో ఉన్న స్కైలార్క్ టవర్స్లో 37వ అంతస్తులో ఈ ఫ్లాటు ఉంది. ఇందులో ఐదు బెడ్ రూమ్ లు, హాలు, కిచెన్, ఇతర సౌకర్యాలు ఉన్నాయి.

Advertisement
Advertisement