నటుడు చలపతిరావుకు గాయాలు.! | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 16 2018 7:10 AM

Actor chalapathi rao injured in shooting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌ సీనియర్ నటుడు చలపతిరావుకు స్వల్ప గాయాలయ్యాయి. ఫిల్మ్‌సిటీలోని ఓ షూటింగ్‌లో పాల్గొన్న ఆయన బస్సు వెనుక నిచ్చెన ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డారు. దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చలపతిరావు ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అల్లరి నరేష్‌ సినిమా షూటింగ్‌ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

చలపతిరావు ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. చలపతిరావు ఆరోగ్య పరిస్థితిని చిత్ర నిర్మాత డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. చలపతిరావు ఆరోగ్యంపై హీరో నరేష్‌ కూడా వాకబు చేశారని సమాచారం. 

Advertisement
Advertisement