ఘనంగా నటుడి చిన్నా కుమార్తె వివాహ రిసెప్షన్‌ | Sakshi
Sakshi News home page

ఘనంగా నటుడి చిన్నా కుమార్తె వివాహ రిసెప్షన్‌

Published Mon, Nov 27 2017 3:38 PM

actor chinnas daughter wedding reception - Sakshi - Sakshi

ప్రముఖ సినీ నటుడు చిన్నా కుమార్తె మోనిక వివాహ రిసెప్షన్‌ ఘనంగా జరిగింది. ఫిల్మ్‌ నగర్‌ క్లబ్‌లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు , చిన్నా స్నేహితులు హాజరై వధూ వరులను ఆశ్వీరదించారు.

వరుడు చైతన్యతో మౌనిక వివాహం ఈ నెల 23 న జరిగిన విషయం తెలిసిందే. తిరుమలలోని కర్ణాటక కల్యాణ మండపంలో పెళ్లి వేడుకను నిర్వహించారు. కాగా చిన్నా కుమార్తె పెళ్లి ఫొటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. 

(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

Advertisement
Advertisement