చైనా మొబైల్ కంపెనీ డీల్‌ను వ‌దులుకున్న హీరో!

10 Jul, 2020 14:11 IST|Sakshi

టిక్‌టాక్ స‌హా 59 చైనా యాప్‌లను నిషేదించిన‌ట్లు భార‌త ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి సినీ ప్ర‌ముఖులు స‌హా ప‌లువురు సెల‌బ్రిటీలు దానికి సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అయితే  బాలీవుడ్ హీరో కార్తీక్  ఆర్య‌న్ మాత్రం మ‌రో అడుగు ముందుకేసి చైనా మొబైల్ సంస్థ‌ల‌తో ఇదివ‌ర‌కే కుదుర్చుకున్న  కొన్ని కోట్ల ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకున్నాడ‌ట‌. కార్తీక్ ఇంత‌కుముందు చైనా మొబైల్ కంపెనీ ఒప్పోకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించేవాడు. అయితే భార‌త్ -చైనా స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో చైనీస్ కంపెనీలతో ఇదివ‌ర‌కే కుదుర్చుకున్న ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా కార్తీక్ తాజా పోస్టులను బట్టి ఫ్యాన్స్ దీన్ని క‌న్ప‌ర్మ్ చేసేశారు. (ఆస్ట్రేలియాలో న‌టికి చేదు అనుభ‌వం)

 తాజాగా న‌టుడు కార్తీక్  త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో యాపిల్ మొబైల్ ఫోన్‌తో ఓ ఫోటోను షేర్ చేశాడు. త‌న ఇంట్లో కిటీకీ ద‌గ్గ‌ర నిల‌బ‌డి మేఘాల‌ను త‌న మొబైల్‌లో ఫొటో తీస్తున్న చిత్రం అది. అయితే కార్తిక్ ప‌ట్టుకున్న ఫోన్ ..ఐ ఫోన్ అవ‌డంతో నెటిజ‌న్లు, ఫ్యాన్స్ చైనా ఫోన్‌కి ప్ర‌చారాన్ని వ‌దిలేశాడ‌ని  అత‌ని ఫొటో ట్యాగ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. దీంతో మిగ‌తా హీరోలు కూడా  చైనా మొబైల్ కంపెనీల‌తో కుదుర్చుకున్న ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. ప్యార్ కా పుంచనామాతో సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కార్తీక్..పంచ‌నామా -2,  కాంచి-ది అన్‌బ్రేక‌బుల్ , లుకా చుప్పి వంటి సినిమాల్లో న‌టించారు. లాక్‌డౌన్ కి ముందు ల‌వ్ ఆజ్ క‌ల్ సినిమాలో సారా అలీఖాన్‌తో స‌ర‌స‌న న‌టించి మంచి గుర్తింపును సంపాదించుక‌న్నాడు ఈ యంగ్ హీరో. 
(ప్ర‌భాస్ సినిమా ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌)

Yes. I am that Bua who needs to click the sky every time there is a cloud ⛅️

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

మరిన్ని వార్తలు