కోర్టుకు నటి రంభ గైర్హాజరు | Sakshi
Sakshi News home page

కోర్టుకు నటి రంభ గైర్హాజరు

Published Sun, Dec 4 2016 12:41 PM

భర్త పిల్లలతో రంభ (ఫైల్‌) - Sakshi

చెన్నై(తమిళ సినిమా): మాజీ హీరోయిన్‌ రంభ కేసు విచారణను నాయ్యస్థానం జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది. నటి రంభ హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉండగానే కెనడాకు చెందిన ఇంద్రన్‌ పద్మనాభన్‌ అనే వ్యాపారవేత్తను 2010లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహానంతం నటనకు దూరంగా ఉన్న రంభకు 2011లో లాన్యా అనే కూతురు, 2015లో సాషా అను మరో కూతురు పుట్టారు. ఆరేళ్లుగా సంతోషంగా సాగిన ఇంద్రన్, రంభల సంసార జీవితంలో మనస్పర్థల కారణంగా ముసలం పుట్టింది. దీంతో ఇటీవల రంభ భర్తను వదిలి ఇండియాకు వచ్చేశారు.

ఇటీవల రంభ తనకు పిల్లలతో ఒంటరిగా జీవించడం సాధ్యం కావడం లేదని, అందువల్ల తన భర్తతో కలిసి ఉండేలా ఆదేశించాల్సిందిగా కోరుతూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో తన భర్త మద్యం తాగి తనను హించించేవారని, అత్తింటి వారు తన పిల్లల్ని వారి కుటుంబంలో చేర్చుకోవడానికి అంగీకరించని కారణంగా తాను మనస్తాపానికి గురై భర్తకు దూరంగా ఉంటున్నానని పేర్కొన్నారు. తాను తన భర్తతో చేర్చే వరకూ తనకు జీవన భృతిగా నెలకు రూ 2.5 లక్షలు చెల్లించేలా తన భర్తను ఆదేశించాలని పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ శనివారం విచారణకు రాగా రంభ కోర్టుకు హాజరు కాలేదు. అయితే తాను పని ఒత్తిడిలో ఉన్నందున విచారణకు హాజరు కాలేకపోతున్నానని, అందువల్ల విచారణను వాయిదా వేయాల్సిందిగా రంభ తరఫు న్యాయవాది ద్వారా కోర్టుకు విన్నవించుకోవడంతో ఈ కేసును జనవరి 21వ తేదీకి  వాయిదా వేస్తున్నట్లు నాయస్థానం ఆదేశించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement