నాకొక కొడుకున్నాడు | Sakshi
Sakshi News home page

నాకొక కొడుకున్నాడు

Published Sat, Jun 14 2014 8:30 AM

నాకొక కొడుకున్నాడు - Sakshi

నాకొక కొడుకున్నాడు అంటూ నటుడు సిద్దార్థ ఊహించని విధంగా అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ దానికి తానే బదులిస్తూ వార్తల్లో ఉండే  నటుడు సిద్దార్థ. ఈయనపై చాలా వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఆ మధ్య శృతిహాసన్‌తో షికార్లంటూ హాట్ హాట్‌గా ప్రచారం జరిగింది. ప్రస్తుతం నటి సమంత తో సహజీవనం అంటూ వదంతులు జోరుగా సాగుతున్నాయి. సమంతతో ప్రేమ అనే వార్తలు అక్కడితో ఆగక ఈ ప్రేమ పక్షులు రహస్యంగా పెళ్లి వరకు వెళ్లాయనే టాక్ కోలివుడ్ కోడై కూస్తోంది. సిద్దార్థకు ఇంతకుముందే వేరే యువతితో పెళ్లయింది.

వీరికి ఒక కొడుకు కూడా ఉన్నారన్న ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. ఇలాంటి ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్న సిద్దార్థ తాజాగా నాకొక కొడుకున్నాడంటూ వెల్లడించి అందర్నీ అతహాస్యుల్ని చేశారు. ఈ విషయం గురించి ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ తనకొక కొడుకున్నాడు.. అయితే అతనికి నాలుగు కాళ్లు, ఒక తోక ఉంది. పదేళ్ల అతని పేరు మోగ్లీ. గుడిసె ప్రాంతంలో తిరుగుతున్న అతన్ని తాను రక్షించి పెంచుకుంటున్నాను. అతని ప్రేమ తనను కట్టిపడేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత భయ స్వభావి అతను. అంటూ కుక్క ఫొటోను పోస్ట్ చేశారు. ఇదే నా మోగ్లీ అని కూడా పేర్కొన్నారు సిద్దార్థ.

Advertisement
Advertisement