కమల్ ఘాటు వ్యాఖ్యలపై స్పందించిన గౌతమి | Sakshi
Sakshi News home page

కమల్ ఘాటు వ్యాఖ్యలపై స్పందించిన గౌతమి

Published Tue, Jul 25 2017 7:52 PM

కమల్ ఘాటు వ్యాఖ్యలపై స్పందించిన గౌతమి - Sakshi

పెరంబూరు: ‘కమల్‌హాసన్‌ వ్యాఖ్యల్లో ఎవరూ తల దూర్చవద్దు. ఆయనకు ఆ హక్కు ఉందని’  నటి గౌతమి అన్నారు.  నటుడు కమలహాసన్‌ ఇటీవల తమిళనాడు రాజకీయాలపై చురుగ్గా స్పందిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందంటూ కమల్‌ చేసిన ఘాటు వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. ప్రతిగా రాష్ట్ర మంత్రులు ఆయనపై ఎదురు దాడి చేస్తుండటంతో కమల్‌ రాజకీయ రంగ ప్రవేశం తథ్యమనే ప్రచారం ఊపందుకుంది. ఆయన అభిమానులు కూడా మంత్రులపై మాటల దాడులు మొదలుపెట్టారు.

ఈ నేపథ్యంలో నటి గౌతమి స్పందిస్తూ.. రాష్ట్రంలో మంచి, చెడు రెండూ ఉన్నాయన్నారు. కమల్‌ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పేర్కొన్నారు. ఆయన అభిప్రాయాల్లో తలదూర్చలేం అన్నారు. అభిప్రాయాలను వ్యక్తం చేయడం ఆయన హక్కు అని నటి పేర్కొన్నారు. నటి గౌతమి కూడా రాజకీయాలపై దృష్టిసారిస్తున్నారనే ప్రచారం కొనసాగుతోంది. కొన్ని రోజుల కిందట ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా కలిసి పలు అంశాలపై చర్చించారు. కమల్‌తో కలిసి గౌతమి అపూర్వసహోదరగళ్, దేవర్‌మగన్, పాపనాశం మూవీలలో నటించారు.  చాలా కాలం సహజీవనం చేసిన వీరు గత నవంబర్ లో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement