వచ్చే వరుడెలా ఉండాలంటే.. | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 12 2018 7:29 PM

Actress Kajal Talks About Her Marriage - Sakshi

సాక్షి, తమిళసినిమా: తనకు కాబోయే వరుడెలా ఉండాలని.. అడిగితే పెద్ద చాంతాడంతా లిస్ట్‌ విప్పింది నటి కాజల్‌ అగర్వాల్‌.. తెలుగు, తమిళం, హిందీ.. ఇలా పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడికి తాజాగా కోలీవుడ్‌లో బంపర్‌ చాన్స్‌ వరించింది. స్టార్‌ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌తో నటించే అవకాశం లభించింది. దీంతో ఆనంద డొలికల్లో తేలియాడుతున్న కాజల్‌ తాజాగా మీడియాతో ముచ్చటించింది. ఆమె ఏం చెప్పిందంటే..

‘ప్రతి సినిమాకు తీవ్రంగా శ్రమిస్తాను. ఫలితాన్ని మాత్రం కాలానికే వదిలేస్తాను. కథ నచ్చితే చాలా వర్ధమాన హీరో అయినా, స్టార్‌ హీరో అయినా నటించడానికి రెడీ. నాకు ఎవరితో నటిస్తున్నానన్నది ముఖ్యం కాదు. ఎలాంటి పాత్రలో నటిస్తున్నానన్నదే ముఖ్యం. ప్రస్తుతం హిందీ సూపర్‌హిట్‌ సినిమా ‘క్వీన్‌’ తమిళ రీమేక్‌లో నటిస్తున్నాను. ఈ చిత్ర కథను తమిళ నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేశారు.

పెళ్లి గురించి..
నా వివాహం గురించి చాలామంది అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే ఒకానొక సమయంలో మనసు పెళ్లి వైపు మళ్లింది. అయితే ప్రస్తుతం ఆ ఆలోచన లేదు. అందుకు ఇంకా సమయం ఉంది. నాకు భర్త అయ్యే వ్యక్తికి కొన్ని అర్హతలు కచ్చితంగా ఉండాలి. నాతో నిజాయితీగా ఉండాలి. నన్ను నిజంగా ప్రేమించాలి. గౌరవించాలి. ఆయనకు ముఖ్యమైన వ్యక్తిని నేనే అయి ఉండాలి. ఇంటి పనుల్లో నాకు సాయంగా ఉండాలి. నన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచుకోవాలి’ అని పేర్కొన్న కాజల్‌.. ఇండియన్‌-2 సినిమాలో కమల్‌తో నటించడం ఆనందంగా ఉందని తెలిపింది.

Advertisement
Advertisement