దేవుడే అవకాశం కల్పించాడు | Sakshi
Sakshi News home page

దేవుడే అవకాశం కల్పించాడు

Published Thu, May 19 2016 2:37 AM

actress keerthi suresh interview

అదృష్టం అన్నది ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక రోజు వరిస్తుంది.
అలాంటి రోజు కోసం ఎదురు చూస్తుంటారు కూడా. అయితే ఎలాంటి
ఎదురు చూపులు లేకుండా అదృష్టం వరించే వారు
చాలా అరుదుగా ఉంటారు. వర్ధమాన నటి కీర్తీసురేశ్ ఈ కోవకే చెందుతారు.

 ఆదిలోనే అనూహ్య విజయాలను, ఊహించని అవకాశాలను అందుకుంటున్న అదృష్ట నటి ఈ కేరళ కుట్టి. అయితే ఈ బ్యూటీని మలయాళీ భామ అనవచ్చో,లేదో అన్నది పాఠకులకే వదిలేస్తున్నాం. ఎందుకంటే కీర్తీ తల్లి తమిళియన్, తండ్రి మలయాళీ. మలయాళ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసిన కీర్తీసురేశ్ ప్రస్తుతం తమిళంలో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతున్నారు. రజనీమురుగన్ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన కీర్తీ నటించిన రెండో చిత్రం ఇదు ఎన్న మాయం చిత్రం తొలుత తెరపైకి వచ్చింది. ఆ చిత్రం ఓకే అనిపించుకున్నా రజనీమురుగన్ ఘన విజయా న్ని సాధించి కీర్తీకి అమాం తం స్టార్‌డంను అంటగట్టింది. ప్రస్తుతం ధనుష్ కు జంటగా తొడ రి చిత్రాన్ని పూర్తి చేసి ఇళయదళపతి 60వ చిత్రంలో ఆయనతో రొమాన్స్ చేస్తున్నారు. మధ్యలో శివకార్తికేయన్‌తో మరో చిత్రం చేస్తున్న ఆ లక్కీ నటితో చిన్న భేటీ.

మీరు నటించిన రెండు చిత్రాలే తెరపైకి వచ్చాయి. చాలా అవకాశాలు చేతిలో ఉన్నాయి. వాటిలో ఇళయదళపతి విజయ్ చిత్రం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితిని మీరు ఊహించారా?
లేదు. కలలో కూడా ఊహించలేదు. అంతా భగవంతుని కరుణగా భావి స్తున్నాను. నా వరకూ నేను ప్రతి చిత్రంలోనూ వైవిధ్యభరిత పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను. నిన్న ఏమి జరిగింది?రేపేం జరుగుతుం ది? అన్నది ఆలోచించను. ఈ రోజు ఏమి చేయగలనో దాన్ని సరిగా చేయాలని భావిస్తాను.

 రజనీమురుగన్ చిత్రం అంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించారా?
నిజం చెప్పాలంటే షూటింగ్ చేస్తున్నప్పుడే రజనీమురుగన్ చిత్రం విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది. కానీ ఘన విజయం సాధిస్తుందని ఊహించలేదు. ఆ చిత్రం నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుంది.

{పారంభ దశలోనే ధనుష్, విజయ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి న టించే అవకాశం రావడం గురించి?
నా గురించి నేను గొప్పగా చెప్పుకోవాలనుకోవడం లేదుగానీ దేవుడే నాకీ అవకాశాలు కల్పించారని భావి స్తాను. నేను మలేషియాలో ఉన్నప్పుడు దర్శకుడు ప్రభుసాల్మన్ కలి సి తొడరి చిత్రంలో ధనుష్‌కు జంట గా నటిస్తారా అని అడిగారు. అప్పు డు నా ఆనందాన్ని మాటల్లో చెప్పలే ను. తొడరి చిత్రం ప్రణాళిక ప్రకారం పూర్తి అయ్యింది. చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఇక విజయ్ 60వ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం రావడం నిజంగా నా అదృష్టమే.ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. విజయ్‌తో నటించడం తీయని అనుభవం.


మీ అమ్మ నుంచి మీరు నేర్చుకుంది?
నేర్చుకున్న విషయాల కంటే సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవాలి. షూటింగ్‌లో ప్రొడక్షన్ బా య్ నుంచి దర్శకుడి వరకూ అందరిని గౌరవించాలి అన్న అమ్మ చెప్పి న విషయాన్ని అక్షరాలా పాటిస్తున్నాను.

కథల ఎంపిక విషయం అమ్మ చూసుకుంటారా? మీ ప్రమేయం ఉంటుందా?
ఆరంభంలో ఆ విషయాలను అమ్మే చూసుకునేవారు. అమ్మ కథ విని నాకు చెప్పేవారు. ఆ తరువాత అమ్మతో పాటు నేను వినేదాన్ని. ఇప్పుడు నేను కథలు ఎంపిక చేసుకుంటున్నాను. అమ్మకు చెబితే నీకు నచ్చితే నటించు అంటారు.

 ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు పాడుతున్నారు. మీకూ అలాంటి కోరిక ఉందా?
నేను నాకు తెలిసిన పనే చేయాలనుకుంటాను. అది మీరి ఒక ఆశతో ఇటీవల సంగీతదర్శకుడు డి.ఇమాన్‌ను పాడే అవకాశం అడిగాను. ఆయన చూద్దాం అన్నారు.

సరే మీరు కేరళ కోడలవుతారా? తమిళనాడు కోడలవుతారా?
నాన్నది కేరళ రాష్ట్రం, అమ్మది తమిళనాడు. నేనే ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నాను. కాబట్టి ఈ ప్రశ్నకు కాలమే బదులివ్వాలి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement