నటి కుమారుడి ఆత్మహత్యాయత్నం?

9 Apr, 2020 07:12 IST|Sakshi
దివంగత నటి మనోరమ

సినిమా: ప్రఖ్యాత దివంగత నటి మనోరమ కుమారుడు భూపతి నిద్రమాత్రలు మింగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. భూపతి స్థానిక టీనగర్‌లోని నీలకంఠం మెహతా వీధిలో కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. కాగా, భూపతికి మద్యపానం అలవాటు ఉంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో భూపతికి మద్యం లభించకపోవడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై భూపతి కుమారుడు రాజరాజన్‌ మాట్లాడుతూ.. తన తండ్రిని ఆస్పత్రిలో చేర్చిన విషయం వాస్తవమేనన్నారు. అయితే, మద్యం అలవాటు ఉన్న ఆయన మత్తు కోసం నిద్ర మాత్రలు వేసుకున్నారని, ఆత్మహత్యాయత్నం కాదన్నారు. వదంతులు ప్రచారం చేయవద్దని కోరారు.

తల్లి మనోరమతో భూపతి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా