రీ–ఎంట్రీతో వినిపించబోతున్నారు

26 May, 2018 05:44 IST|Sakshi

‘ఇడియట్, శివమణి’ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బెంగళూరు బ్యూటీ రక్షిత. 2007లో దర్శకుడు ప్రేమ్‌తో పెళ్లి జరగడంతో సినిమాలకు స్వస్తి చెప్పేశారామె. సిల్వర్‌ స్క్రీన్‌కు దూరం అయినప్పటికీ టెలివిజన్‌ షోలకు న్యాయ నిర్ణేతగా చేస్తున్నారు రక్షిత. ఆల్మోస్ట్‌ పదేళ్ల తర్వాత సిల్వర్‌ స్క్రీన్‌కి రీ–ఎంట్రీ ఇస్తున్నారు రక్షిత. కానీ ఈసారి రక్షిత కనిపించరు.. వినిపించబోతున్నారు.

సుదీప్, శివరాజ్‌ కుమార్‌ హీరోలుగా భర్త ప్రేమ్‌ రూపొందిస్తున్న కన్నడ సినిమా ‘విలన్‌’లో హీరోయిన్‌ అమీ జాక్సన్‌ పాత్రకు డబ్బింగ్‌ చెప్పబోతున్నారట.  ‘‘ప్రేమ్‌తో వర్క్‌ చేయడం అంత సులువేం కాదు. అతను పర్ఫెక్షనిస్ట్‌. కొన్నికొన్ని సార్లు డైలాగ్‌ను 20 సార్లు చెప్పించేవారు. ఎంత పెద్ద డైలాగ్‌ని అయినా ముక్కలుగా కట్‌ చేసి చెప్పించరు. మొత్తం చెప్పాల్సిందే. ఎన్ని టేక్స్‌ అయినా ఆయనకు సంబంధం లేదు. గతంలో నా పాత్రలకు నేనే డబ్బింగ్‌ చెప్పాను. కానీ వేరే వాళ్లకు డబ్‌ చేయడం చాలా డిఫరెంట్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు రక్షిత.

మరిన్ని వార్తలు