కెమెరా చూసి మొహం చాటేసింది | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 8 2018 8:29 PM

Actress Rekha Hide Her Face - Sakshi

సాక్షి, సినిమా : బాలీవుడ్‌ సీనియర్‌ నటి రేఖ కెమెరాను చూసి పరుగులు తీశారు. రీసెంట్‌గా షాపింగ్‌ వెళ్లిన ఆమెను చిత్రీకరించేందుకు ఓ అభిమాని ప్రయత్నించాడు. కంప్లీట్‌ తెలుపు దుస్తుల్లో ఉన్న ఆమె షాపు నుంచి బయటకు వచ్చారు. 

ఈ క్రమంలో ఓ అభిమాని ఆమెను వీడియో తీస్తున్న దృశ్యాన్ని ఆమె గమనించారు. ఒక్కసారిగా ఆ కెమెరాను చూసి ముఖం చాటేసింది. ఆపై అలాగే వేగంగా వెళ్తూ కారులో కూర్చుని నిష్క్రమించింది. ఆ సమయంలో ఆమె మేనేజర్‌ ఆమె వెంటే ఉన్నారు. 

కెమెరా ముందు ఏ మాత్రం బెణుకు లేకుండా నటించే రేఖ.. ఎందుకిలా చేసింది చెప్మా? అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 

Advertisement
Advertisement