సీన్‌ టు సీన్‌ అర్జున్‌రెడ్డే..!!

23 Oct, 2019 10:53 IST|Sakshi

తెలుగులో అర్జున్‌రెడ్డి.. హిందీలో కబీర్‌ ఖాన్‌.. ఇప్పుడు తమిళంలో ఆదిత్యవర్మ. తెలుగు నాట సూపర్‌హిట్‌ అయిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా హిందీలోనూ ‘కబీర్‌ సింగ్’గా ప్రేక్షకుల ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. హిందీలోనూ ఈ సినిమా కథ మీద, ఈ సినిమాలో హీరో పాత్రను చూపించిన తీరు మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ భారీ వసూళ్లతో ఈ ఏడాది బిగ్గెస్ట్‌ హిట్స్‌లో ఒకటిగా నిలిచి ‘కబీర్‌ సింగ్‌’ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఇదే కథ త్వరలో తమిళ ప్రేక్షకులను ‘ఆదిత్య వర్మ’గా పలుకరించనుంది.

ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఇందులో తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌ హీరోగా నటించారు. ఆయన సరసన బనితా సంధు కథానాయికగా నటించింది. అర్జున్‌ రెడ్డి కథ మనకు తెలిసిందే. అచ్చం తమిళంలోనూ సీన్‌ టు సీన్‌ అదే కథను తెరకెక్కించినట్టు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. కానీ, ఈ ట్రైలర్‌లో ధ్రువ్‌ తనదైన ఒరిజినల్‌, ఇంటెన్స్‌, రా నటనతో ఆకట్టుకున్నాడు. ప్రేమలో విఫలమైన వైద్యుడిగా, డ్రగ్‌, ఆల్కాహల్‌ ఆడిక్ట్‌గా ఎమోషనల్‌ సీన్లలో తనదైన నటనను కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.ఈ తమిళ ట్రైలర్‌పై ఇప్పటికే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయినట్టు కనిపిస్తోంది. అన్నట్టు, బాలా దర్శకత్వంలో అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌ను పూర్తిస్థాయిలో తెరకెక్కించిన తర్వాత.. అది బాగా రాలేదని నిర్మాతలు పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త దర్శకుడు గిరాషాయా దర్శకత్వంలో మళ్లీ పూర్తిస్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించారు.  బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిత్యవర్మ’ టీజర్‌లో తమిళ నేపథ్యానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసినట్టు కనిపించింది. కానీ ఇప్పుడు కొత్త దర్శకుడు తీసిన ట్రైలర్‌లో మాత్రం పూర్తిగా ‘అర్జున్‌రెడ్డి’ యథాతథంగా కనిపిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘బాహుబలి’కి భల్లాలదేవ విషెస్‌

కీరవాణి తనయుల సిన్మా.. ఎన్టీఆర్‌ ట్వీట్‌!

బిగ్‌బాస్‌ ఇంట్లో సర్కస్‌, నేడే చూడండి!

‘వార్‌-2’: హృతిక్‌ను ప్రభాస్‌ ఢీకొడతాడా?

నటి బర్త్‌ డే పార్టీ: ప్రియుడితో స్టెప్పులు!

ఆయనతోనే జీవితం అనుకున్నా.. అందుకే..

బిగ్‌బాస్‌: ఫైనల్‌కు రాహుల్‌, అలీకి బిగ్‌ షాక్‌

ఎలా ఉండేదాన్ని ఇలాగయ్యా!

నాన్న లేకుంటే నేను లేను

నేను చాలా తప్పులు చేశా..

ప్రధానిపై కుష్బూ ఫైర్‌

తుపాకి రాముడుకి థియేటర్లు ఇవ్వాలి

నకిలీ ఆహ్వానం

ప్రేక్షకుల సపోర్ట్‌ చాలు

మా ఏపీ సభ్యులకు రూ.5 లక్షల ప్రమాద బీమా

సినీ పరిశ్రమ అభివృద్ధికి జగన్‌ ముందుంటారు

ఫారిన్‌ పోదాం రాములా!

నీ పరిచయం తర్వాత అన్నీ మధుర క్షణాలే

డార్లింగ్‌కి శుభాకాంక్షలు

వైరలవుతున్న అలియా, రణ్‌బీర్‌ వెడ్డింగ్‌ కార్డు!

‘దబాంగ్‌-3’తో నటుడి కుమార్తె తెరంగ్రేటం

‘రాములో రాములా..నన్నాగం చేసిందిరో’

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థపై ఐటీ దాడులు

‘రాగానే రోజ్‌వాటర్‌తో ముఖం కడిగేవాడిని’

బిగ్‌బాస్‌: అలీని చూసి వణికిపోతున్న హౌస్‌మేట్స్‌

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమ.. ఇప్పుడు నిశ్చితార్థం

బిగ్‌బాస్‌: బాబాపై ప్రతాపాన్ని చూపిస్తున్న అలీ..

ఏదైనా రాజకీయాలు జరిగితే శ్రీముఖి విన్నర్‌ కావొచ్చు..

షావుకారు జానకి @400

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘వార్‌-2’: హృతిక్‌ను ప్రభాస్‌ ఢీకొడతాడా?

బిగ్‌బాస్‌ ఇంట్లో సర్కస్‌, నేడే చూడండి!

ఆయనతోనే జీవితం అనుకున్నా.. అందుకే..

బిగ్‌బాస్‌: ఫైనల్‌కు రాహుల్‌, అలీకి బిగ్‌ షాక్‌

ఎలా ఉండేదాన్ని ఇలాగయ్యా!

నాన్న లేకుంటే నేను లేను