ప్రముఖ టీవీ హోస్ట్‌కు చీర కట్టిన ఐశ్వర్యరాయ్‌‌‌

16 May, 2020 19:21 IST|Sakshi

ముంబై : మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్‌ హీరోయిన్‌ ఐశ్వర్యరాయ్ ప్రముఖ హాలీవుడ్‌ టీవీ హోస్ట్‌ ఓప్రా విన్‌ఫ్రే‌కు చీర కట్టుకోవటం ఎలాగో నేర్పుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన ఆ సీన్‌ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. 2005లో ఐశ్వర్యరాయ్..‌ ఓప్రా షోలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా ఐశ్వర్య ఈ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ పింక్‌ కలర్‌ శారీని ఆమె ఓప్రాకు బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా దాన్ని ఆమెకు కట్టారు. చీరలో తాను అందంగా కనిపిస్తున్నానని ఓప్రా సంతోషం వ్యక్తం చేశారు. ఈ షోలో ఐశ్వర్య మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, ఆతిథ్యం గురించి చెప్పారు. ( ‘ఐశ్వర్య విషయంలో దురదృష్ట వంతుడిని’ )

కామ సూత్ర పుట్టిన గడ్డనుంచి వచ్చానంటూ తనను తాను పరిచయం చేసుకున్నారు. కాగా, 2009లో ఐశ్వర్య, అభిషేక్‌లు భార్యభర్తలుగా ఓప్రా షోలో పాల్గొన్నారు. 2012లో భారత్‌కు వచ్చిన ఓప్రాకు అభిషేక్‌ బచ్చన్‌ దంపతులు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలను ఓప్రా కలుసుకున్నారు. నిండైన చీరతో దర్శనిమిచ్చారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా