'నాకంటే ఆయనే సక్సెస్ఫుల్ హీరో' | Sakshi
Sakshi News home page

'నాకంటే ఆయనే సక్సెస్ఫుల్ హీరో'

Published Mon, Mar 21 2016 3:18 PM

'నాకంటే ఆయనే సక్సెస్ఫుల్ హీరో' - Sakshi

ముంబయి: అక్షయ్ కుమార్ను బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహం పొగడ్తల్లో ముంచెత్తాడు. అక్షయ్తోపాటు కలిసి పలు చిత్రాల్లో నటించిన ఆయన తనకంటే అక్షయ్ కుమార్ చాలా సక్సెస్ ఫుల్ నటుడని అన్నాడు. అక్షయ్ సీని జర్నీ ఓ స్ఫూర్తిదాయకం అని చెప్పాడు. అక్షయ్ తనకు తానుగా ఎదిగినవాడని, నిరూపించుకున్నవాడని తెలిపాడు.

అక్షయ్ 1985లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారని, తాను 2003లో అడుగుపెట్టానని చెప్పాడు. అక్షయ్ అంటే తనకు చాలా అభిమానం అని, తాను అతడిని ఎంతో గౌరవిస్తానని తెలిపాడు. యార్ మేరా సూపర్ స్టార్ అనే ఓ టీవీ కార్యక్రమంలో అబ్రహం మాట్లాడుతూ 'మేమిద్దరం కలిసి గరం మసాలా, హౌజ్ ఫుల్ 2, దేశీబాయ్స్' అనే సినిమాల్లో నటించాం. తాను హాస్యాన్ని ఎంతో ఇష్టపడతానని, కామెడీని అక్షయ్ నుంచే నేర్చుకున్నానని చెప్పాడు. అంతే అతడిని తాను గురూజి అని పిలుస్తానని, అక్షయ్ తనను సుందీ అని పిలుస్తాడని చెప్పారు. 'రాకీ హ్యాండ్ సమ్' అనే చిత్రంతో వచ్చే శుక్రవారం జాన్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. 

Advertisement
Advertisement