'సింగ్ ఈజ్ బ్లింగ్'కు సీక్వల్.? | Sakshi
Sakshi News home page

'సింగ్ ఈజ్ బ్లింగ్'కు సీక్వల్.?

Published Wed, Nov 4 2015 11:06 AM

akshay kumar to make a sequal for singh is bling

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ రాఫ్తార్ సింగ్గా నటించిన కామెడీ ఎంటర్టైనర్ 'సింగ్ ఈజ్ బ్లింగ్'.  పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి అక్షయ్ కెరీర్లో మరో బిగ్ హిట్గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి సీక్వల్ ప్లాన్ చేస్తున్నారన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది.

దర్శకుడు ప్రభుదేవా కూడా ఈ సీక్వల్కు ఓకె చెప్పినట్టుగా సమాచారం. 'సింగ్ ఈజ్ బ్లింగ్'కు ముందు రిలీజ్ అయిన 'సింగ్ ఈజ్ కింగ్' కూడా ఘనవిజయం సాధించింది. అందుకే ఈ సీరీస్లో మూడో సినిమా రిలీజ్ అయితే అది అక్షయ్ కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశంఉందని ఫీల్ అవుతున్నారు చిత్రయూనిట్. అందుకు తగ్గట్టుగానే గత రెండు భాగాలకు మించి మరింత ఎంటర్టైనింగ్గా ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.

తొలి భాగంలో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించగా, రెండో భాగంలో అమీజాక్సన్,లారా దత్తాలు హీరోయిన్లుగా కనిపించారు. ఇప్పుడు ఈ సీరీస్లో మూడో భాగం తెరకెక్కితే పాత నటీనటులనే కొనసాగిస్తారా లేక కొత్త వారిని తీసుకుంటారా అన్న విషయంపై కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ 'ఎయిర్లిఫ్ట్'లో నటిస్తున్న అక్షయ్ ఆ సినిమా పూర్తయిన తరువాత 'సింగ్ ఈజ్ బ్లింగ్' సీక్వల్పై దృష్టి పెట్టనున్నాడు.

Advertisement
Advertisement